‘రుద్రమదేవి’ సినిమా తర్వాత గుణశేఖర్ తెరకెక్కించనున్న మూవీ ‘శాకుంతలం’. ఈ ప్రాజెక్ట్ ని ముందుగా ఎనౌన్స్ చేసారు కానీ.. హీరోయిన్ ఎవరు అనేది మాత్రం అప్పుడు ప్రకటించలేదు. కొత్త సంవత్సరం రోజున ఇందులో సమంత నటించనున్నట్టు అఫిషియల్ గా గుణశేఖర్ ప్రకటించారు. అయితే.. దీని వెనక చాలా జరిగిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్యకశ్యప’ సినిమాని దగ్గుబాటి రానాతో చేయాలి అనుకున్నారు.
అయితే.. దగ్గుబాటి రానా వేరే ప్రాజెక్టుల్లో బిజీ కావడం.. ఆతర్వాత కరోనా రావడంతో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా చేయలేమని ప్రస్తుతానికి పక్కన పెట్టేసారు. గుణశేఖర్ శాకుంతలం సినిమాని తీయడానికి ఫిక్స్ అయ్యారు కానీ.. లీడ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారనేది మాత్రం కన్ ఫర్మ్ కాలేదట. ఆ టైమ్ లో దిల్ రాజు, గుణశేఖర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుని.. ఈ ప్రాజెక్ట్ లో తను భాగస్వామిగా చేరతానన్నారట.
గుణశేఖర్ ఓకే అనడంతో.. ఆయనే దిల్ రాజే సమంతకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి.. ఒప్పించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ చారిత్రాత్మక చిత్రానికి దిల్ రాజు సహ నిర్మాత అంటున్నారు. ఈ మూవీకి దిల్ రాజు పేరు కూడా చేరితే… ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Also Read: యూట్యూబ్ లోకి ‘రానా’ అంటూనే వచ్చేశారు