సినీ ఇండస్ట్రి.. హాట్ రూమర్స్ ,అఫ్ఫైర్స్ ,లవ్ అఫైర్స్ కి కేరాఫ్ గా చెప్పుకునే ఇండస్ట్రిలలో ఒకటి. ముఖ్యంగా ప్రముఖుల గురించి వచ్చే గాసిప్స్ కానీ వార్తలు కానీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అందులోనూ సినీ స్టార్స్ గురించిన న్యూస్ అంటే.. వాళ్ళు చిన్న నటీనటులు అయినా పెద్ద స్టార్స్ అయినా.. ఆ వార్తాలకు ఉండే డిమాండే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పై వస్తున్న వార్తలు తెగ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల వారసుడిగా తెరంగేట్రం చేసిన నరేష్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జంబలకిడి పంబ, హై హై నాయకా, చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిత్రాలన్నీ ఆ కోవకు చెందినవే.ఇక హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన నరేష్ ప్రస్తుతం నటుడిగా , సహాయ పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. అయితే నటుడిగా నరేష్ లైఫ్ సక్సెస్ ట్రాక్ లోనే నాడుస్తున్నప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలతోనే నిండుకుని ఉందని చెప్పుకోవచ్చు.
నరేష్ కి ఇప్పటికే మూడు సార్లు వీఆవాహం జరిగింది.ఈయన మొదటి వివాహం సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెతో జరగగా , వీరికి నవీన్ అనే ఒక బాబు జన్మించాడు. కొంతకాలానికి వీరి మధ్య మనస్ఫర్ధలు రావడంతో వీరు విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నా అది కూడా విడాకులకే దారితీసింది.ఇక 50 ఏళ్ళ వయస్సులో నరేష్ మూడో వివాహం చేసుకున్నాడు. ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010లో హిందూపురంలో పెళ్లాడగా..వీరికి ముగ్గురు కొడుకులు.అయితే గడిచిన కొంత కాలంగా వీరు ఇరువురు దూరంగా ఉంటుండగా,తాజాగా తన మూడో భార్య రమ్యకు విడాకులు ఇచ్చేందుకు నరేష్ సిద్ధంఅయ్యారు.కాగా, ప్రస్తుతం నరేష్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఆయన ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్‌ను నాలుగో వివాహం చేసుకుంటున్నారని వస్తున్న వార్తలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
నరేష్, పవిత్ర లోకేష్ ల మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు గత కొంతకాలంగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ ఈ వార్తలు నిజం అనేలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో వీరి బంధం పై మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి.ఈ క్రమంలో.. తాజాగా తెరపైకి వచ్చిన నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి వీరిద్దరి రిలేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ , పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ మండిపడ్డారు.నరేష్ కు , తనకు ఇంకా విడాకులు కాలేదని.. విడాకులు ఇచ్చేందుకు కూడా తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.దీంతో నరేష్, పవిత్ర లోకేష్ వీరి రిలేషన్ షిప్ పై వస్తున్న కథనాలు, రమ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, తమకు వివాహం జరగబోతోందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఇరువురు చెపుకొచ్చారు. అదే సమయంలో నరేష్ తన మూడో భార్య రమ్య పై అనేక ఆరోపణలు చేశారు. రమ్యకి మనుషుల కంటే డబ్బే ముఖ్యమని, ఆమె తనను డబ్బు కోసం వేధిస్తూ ఉండేదని చెప్పుకొచ్చారు. గతంలోనూ సెలబ్రిటీ ఇమేజ్ ని వాడుకుని అనేకమంది దగ్గర నుంచి రమ్య డబ్బులు వసూలు చేసిందని, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇదే విషయమై ఆమె పై కేసు కూడా నమోదయిందని తెలిపారు.
ఇది జరిగి రెండు రోజులు కాకముందే నరేష్, పవిత్ర లోకేష్ లు మైసూర్ లోని ఓ హోటల్ గదిలో దర్శనమిచ్చారు. నరేష్ మూడో భార్య రమ్య.. పవిత్ర లోకేష్‌తో హోటల్‌లో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పోలిసులతో పాటు వెళ్ళిన రమ్య ఆందోళనకు దిగి, వారిపై చెప్పుతో దాడిచేసేందుకు ప్రయత్నించారు.అయితే నరేశ్, పవిత్రా లోకేశ్‌లకు సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు రమ్యను అడ్డుకున్నారు.. ఇక తమపై దాడి చేసేందుకు యత్నించిన రమ్యను మరింతగా ఉడికించేందుకు నరేశ్ యత్నించాడు. రమ్యను చూసి విజిల్ వేస్తూ ఆయన వెళ్లిపోయాడు. అంతేకాకుండా చేయి ఊపుతూ, రమ్య గురించి కామెంట్ చేస్తూ వెళ్లిపోయాడు.
మరోవైపు రమ్య మాత్రం నరేష్, పవిత్ర వ్యవహారంపై మండిపడుతున్నారు. వీరి వ్యవహారంతో తన బిడ్డ కూడా చాలా ఆందోళనకు గురయ్యాడని.. ఏదిఏమైనా తనకు విడాకులు వద్దని అంటున్నారు. తన విషయం ముందు తేల్చాలని , ఆ తర్వాతే మిగితా మశాల గురించి ప్రస్తావించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని రమ్య చెబుతున్నారు.
మొత్తానికి నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహరం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారగా.. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే అంశం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎటునుంచి ఎటువైపుకు తిరుగతుందో వేచి చూడాలి.