Top 20 Most Followed Bollywood Celebrities On Twitter :
హీరోలకు అభిమానులు పెద్ద కోటలాంటి వారు. పెద్ద ఎత్తున అభిమాన సంఘాలున్న హీరోలు ఇంకా ఉన్నారనుకోండి. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లను పెంచుకోవడం మీద హీరోలంతా ప్రత్యేక దృష్టిపెట్టారు. ముఖ్యంగా ట్విట్టర్ లో వీరంతా యాక్టివ్ గా ఉంటారు. బాలీవుడ్ విషయానికి వస్తే అగ్రతారాగణమంతా తమ ఫాలోవర్లను పెంచుకోవడంలో మాత్రం పోటీ పడుతున్నారు. ఈ విషయంలో బిగ్ బీ అమితాబ్ దే అగ్రస్థానం అనుకోవాలి. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న 20 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం. 2006 నుంచి వీరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉన్నారు.
తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవడానికి వారికి ఇవి మంచి వేదికగా ఉపయోగపడుతున్నాయి. ఇది వరకు వారు ప్రజలకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీడియా ముందుకు రావలసి వచ్చేది. ఎప్పుడు ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వీరిలో నటీనటులే కాదు దర్శకులూ ఉన్నారు. 4.61 కోట్ల ఫాలోవర్లు ఉన్న అమితాబ్ 2010 నుంచి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో అగ్రస్థానం కూడా ఆయనదే. ఏ కాస్త సమయం దొరికినా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తారు. ఆ తర్వాత స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య 4.27 కోట్లు. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు.
2009 నుంచి ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆయనకు 4.21 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక నాలుగో స్థానం షారుక్ ఖాన్ ది. ఆయనకు ఉన్న ఫాలోవర్లు 4.19 కోట్లు. 3.07 కోట్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో హృతిక్ రోషన్, 2.76 కోట్లతో ఆరో స్థానంలో దిపికా పదుకునే, 2.73 కోట్లతో ఏడో స్థానంలో ప్రియాంకా చోప్రా, 2.25 కోట్లతో ఎనిమిదో స్థానంలో అనుష్కా శర్మ, 2.09 కోట్లతో తొమ్మిదో స్థానంలో ఆలియా భట్, 1.82 కోట్లతో పదో స్థానంలో కపిల్ శర్మ ఉన్నారు. టాప్ టెన్ స్థానాలను వీరు ఆక్రమించారు. మిగతా పది స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
1.72 కోట్లతో కరణ్ జొహార్, 1.54 కోట్లతో అభిషేక్ బచ్చన్, 1.52 కోట్లతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, 1.52 కోట్లతో షాహిద్ కపూర్, 1.45 కోట్లతో అజయ్ దేవ్ గణ్, 1.39 కోట్లతో శ్రద్దా కపూర్, 1.39 కోట్లతో రణ్ వీర్ సింగ్, 1.31 కోట్లతో సోనమ్ కపూర్, 1.25 కోట్లతో ఫర్హాన్ అఖ్తర్, 1.19 కోట్లతో వరుణ్ ధావన్ ఉన్నారు. ఇలా తమ ఫాలోవర్లను పెంచుకోవడం మీద వీరి దృష్టి ఉంది. ఎవరికి వారు సోషల్ మీడియా టీమ్ లను కూడా ఏర్పాటుచేసుకున్నారు.
కొందరు తామే స్వయంగా వీటిని నిర్వహించుకుంటుండగా సమయంలేని వారు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని తమ టీమ్ లకు చెప్పి జనానికి చేరేలా చేస్తున్నారు. మీడియా సంస్థలు కూడా ఈ ట్వీట్ల ఆధారంగానే కథనాలు రాయడం ప్రారంభమైంది. మాధురీ దీక్షిత్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ లంటి వారంతా వెనకబడి ఉన్నారు. ట్విట్టర్ లో ఫాలోవర్లను పెంచుకోవడంలో ముందుండాలన్న తపన అందరిలోనూ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఇలాంటి ట్విట్టర్ పోటీ ఉంది.
Must Read ;- రామ్ చరణ్ & శంకర్ మూవీ టైటిల్ ఇదేనా?











