మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. అంతకుముందే అభిమానులకు ఓ హాట్ న్యూస్ అందించేందుకు కూడా రెడీ అవుతున్నారు. అదేంటంటే ‘లూసీఫర్’ రీమేక్ సెట్ లో అడుగుపెట్టబోతున్నారు. ‘ఆచార్య’ నుంచి ‘లూసీఫర్’లోకి వెళ్లడం హాట్ న్యూసే. దానికన్నా హాట్ న్యూస్ ఏమిటంటే దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు కూడా ఖరారైందంటున్నారు. మలయాళంలో రూపొందిన ‘లూసీఫర్’ను తెలుగులో అనువదించి విడుదల చేశారు. ఈ కథలో చాలామార్పులు చేసి ఇంకా పవర్ ఫుల్ గా చిరంజీవి పాత్రను మలిచినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ మూవీకి మరింత మైలేజ్ తెచ్చేందుకు ఓ బాలీవుడ్ కండల వీరుడిని కూడా ఇందులో దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అతను మరెవరో కాదు సల్మాన్ ఖాన్. ఇతని కోసం ఓ కీలక పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. లూసీఫర్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసమే సల్మాన్ ఖాన్ ను ఒప్పించినట్టు తెలుస్తోంది. ఈ పాత్రను మొదట రామ్ చరణ్ తోనే చేయించాలని అనుకున్నారు. ఆల్రెడీ ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఉండటం, రామ్ చరణ్ కు వేరే సినిమా కమిట్ మెంట్ ఉండటం లాంటి కారణాలతో పాటు సినిమాకు పాన్ ఇండియా లుక్ తేవడానికి కూడా సల్మాన్ వైపు మొగ్గు చూపారు.
ఈ సినిమా టైటిల్ గాడ్ ఫాదర్ ను కూడా చిరు పుట్టిన రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో నటించడానికి సల్మాన్ ఖాన్ ఓ షరతు పెట్టాడట. అదేంటంటే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను అతను అడిగాడట. హిందీలో తాను చిరంజీవి పాత్రను చేస్తానని, తెలుగులో తను చేసే పాత్రను రామ్ చరణ్ చేయాలి అనే కండిషన్ తోనే అంగీకరించాడట. మరి ఈ షరతులకు చిరంజీవి ఏమంటారో తెలియాలి. ఈ షరతులన్నీ కదిరితే సరే.. ఒకవేళ కుదరకపోతే అల్లు అర్జున్ ఈ పాత్రను చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అసలు రామ చరణ్ తర్వాత పరిశీలనలోకి వచ్చిన పేరు అల్లు అర్జున్ మాత్రమే. ఆ తర్వాతే సల్మాన్ వైపు తిరిగింది. ఇక మరో హీరో సత్యదేవ్ కూడా మరో పాత్రను చేయనున్నారు. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్ర ఇది. చిరు చెల్లిగా మొదట నయనతార అనుకున్నా అది చివరికి కీర్తి సురేష్ ను వరించింది. చిరంజీవి తమ్ముడి పాత్ర కూడా ఇందులో కీలకం. దీన్ని వరుణ్ తేజ్ తో చేయించాలని భావిస్తున్నారు. ఇవన్నీ అధికారికంగా ఖరారు కావలసి ఉంది. చిరు పుట్టిన రోజు నాడు చాలా వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Must Read ;- ‘ఆర్ఆర్ఆర్’ స్థానంలో ‘ఆచార్య’ వస్తుందా?