కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి?
ఏపీ డీజీపీ సవాంగ్ పై వేటు పడింది. సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా ఇంటెలిజెన్స్ డిజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించనున్నట్లు అందుతున్న సమాచారం. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి నియామకంపై ఇంకా అధికార ఉత్తర్వులు వెలువడలేదు. ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 1992 బ్యాచ్ కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 2026 ఏప్రిల్ 30 వరకు విధుల్లో ఉండే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఏపీ ప్రభుత్వం డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగిచనున్నట్లు తెలుస్తోంది.
‘చలో విజయవాడ’ తెచ్చిన తిప్పలు ..
ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఈ నెల 3న విజయవాడలో ర్యాలీ, సభ నిర్వహించారు. దీనిని అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ఉద్యోగులను పోలీసులు అనుమతించారన్న అనుమానంతో జగన్ రెడ్డి ప్రభుత్వం డీజీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎం ను కలిసి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ బదిలీ అనివార్యంగా మారినట్లు సమాచారం. కొత్త డీజీపీ నియామకం కోసం ఏపీ ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది!
Must Read:-వివాదస్పద నిర్ణయాలతో సెన్సిటీవ్‌గా మారుతున్న విజయవాడ!