July 6, 2026 9:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గురజాడ మాట.. నేటి తరానికి బాట

సామాజిక సృహ‌తో నాటి సాంఘిక దురాచారాల‌పై ఆయ‌న త‌న ర‌చ‌న‌ల‌ ద్వారా పోరాటం చేసి గురజాడ విశ్వకవిగా ఘనతకెక్కారు. ఆ మహనీయుని వర్ధంతి నేడు.

November 30, 2020 at 5:22 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజ‌య‌న‌గ‌రం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

విశ్వకవిగా ఘనతకెక్కిన గురజాడ మాట నేటి తరానికి బాట వేసింది. ఆయ‌న ర‌చ‌న‌లు ప్ర‌పంచానికి ఆద‌ర్శ‌మ‌య్యాయి. సామాజిక సృహ‌తో నాటి సాంఘిక దురాచారాల‌పై ఆయ‌న త‌న ర‌చ‌న‌ల‌ ద్వారా పోరాటం చేశారు. ఆనాడే మ‌హిళ‌ల ఇబ్బందుల‌ను అర్ధం చేసుకొని స్త్రీ పాత్ర‌ల‌ను ఉదాత్తంగా తీర్చిదిద్దారు. అటువంటి మహనీయుని 105వ వర్థంతి సందర్భంగా .. లియో పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం ..

విజయనగరంతో మమేకం

గురజాడ పుట్టింది విశాఖ జిల్లాలో అయినప్పటికీ చదువు, ఉద్యోగం, ఆవాసం అంతా విజయనగరం జిల్లాలోనే .. అందువల్ల ఆయన విజయనగరం అడుగుజాడగానే ప్రపంచం మదిలో నిలిచారు. విజయనగరం ప్రజలతో మమేకం అయ్యారు. నేటికీ విజయనగరం పేరు చెబితే గురజాడ గుర్తుకు వచ్చేలా సముచిత స్థానం పొందారు. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్‌ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. తల్లి కౌశల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు. తండ్రి విజయనగరం సంస్ధానంలో పేష్కారుగాను, రెవెన్యూ సూపర్‌వైజర్‌గాను, ఖిల్లేదారుగాను పని చేశారు. తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నపుడు అంటే సుమారు 1872 వరకు అప్పారావు విద్యాభ్యాసం చీపురుపల్లిలోనే జరిగింది. ఆ తరువాత బి.ఏ. వరకు విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకున్నారు. గిడుగు రామమూర్తి పంతులు ఆయనకు ప్రాణ మిత్రుడు. అప్పారావు 1882లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. హైస్కూల్లో చదివే రోజుల్లోనే అప్పారావు శ్లోకాలు రాసే స్ధాయికి ఎదిగారు. ఆయన ఆంగ్లంలో రాసిన ‘‘కుక్కు” అనే పద్యం 1882లో పత్రికల్లో ప్రచురితమయ్యింది.

ప్రిన్సిపాల్‌ ఇంట్లో వసతి

పేదరికంలో ఉన్న అప్పారావుకు మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర శాస్త్రి తన ఇంట్లో వసతి కల్పించడమే గాక భోజనం కూడా పెట్టి ఆదుకున్నారు.1882 నుండి రెండేళ్ళ పాటు ఎఫ్‌.ఏ. కోర్సు అభ్యసించారు.1883 లో ఆయన రాసిన సారంగధర అనే ఇంగ్లీషు పద్యకావ్యం ప్రచురితమయ్యింది.  అప్పారావు తన సోదరుడు శ్యామలరావుతో కలిసి విజయనగరంలో గల ఇండియన్‌ లీజర్‌ అవర్‌, తెలుగు హార్స్‌ అనే పత్రికలకు ఇంగ్లీషు పద్యాలను రాసి పంపించేవారు.ఆయన రచనలను మెచ్చుకుని కలకత్తాకు చెందిన ‘‘రీన్‌ అండ్‌ రయ్యత్‌ ” (రాజు, రైతు ) అనే పత్రిక సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ తన పత్రికలో పునర్ముద్రించారు. ఆ తరువాత అప్పారావు రాసిన చంద్రహాస అనే ఇంగ్లీషు కావ్యాన్ని ఇండియన్‌ లీజర్‌ అవర్‌ సంపాదకులు గుండుకుర్తి వెంకటరమణయ్య ఎంతో మెచ్చుకుని ప్రచురించారు.1884 నుండి 1886 వరకు బి.ఏ. ఫిలాసఫీ అభ్యసించారు.ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకుని ఆ భాషపై చక్కటి పట్టు సాధించారు.

ఎమ్మార్‌లో ఉపాధ్యాయునిగా..

చదువు పూర్తయిన వెంటనే మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు.  1885 లో దేవరాపల్లిలోని యల్లాప్రగడ సన్యాసిరాజు గారి కుమార్తె అప్పల నరసమ్మతో వివాహమయ్యింది. 1886లో ఆ పాఠశాలకు సెలవు పెట్టి డిప్యూటీ కలక్టర్‌ ఆఫీసులో హెడ్‌ క్లర్క్‌ ఉద్యోగంలో చేరారు.1887 లో విజయదశమి నాడు మహారాజా కళాశాలలో నాల్గవ గ్రేడు లెక్చరర్‌గా చేరారు. ఆ ఏడాదే ఆయనకు మహారాజు ఆనంద గజపతి రాజుతో పరిచయమైంది.  ఆయన కాంగ్రెస్‌ సభలో ఇచ్చిన ఉపన్యాసం అప్పారావుకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. 1892 ఆగస్టు 13వ తేదీన ” కన్యాశుల్కం ” తొలికూర్పును ప్రదర్శించారు. 1915  నవంబరు 30న గురజాడ తన తుదిశ్వాస విడిచారు.

ఘన నివాళి

గుర‌జాడ వ‌ర్థంతి సంద‌ర్భంగా సోమవారం స్థానిక అధికారులు, ప‌ట్ట‌ణ ప్ర‌ముఖులు మ‌హాక‌వికి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. గుర‌జాడ స్వ‌గృహంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి, విగ్ర‌హానికి  జాయింట్ క‌లెక్ట‌ర్‌ జె. వెంక‌ట‌రావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీల‌క్ష్మి, డిపిఆర్ఓ డి.ర‌మేష్‌, సాయిఫౌండేష‌న్ ప్ర‌తినిధి కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ప్ర‌తినిధులు పి.వి.న‌ర్సింహ‌రాజు, డాక్ట‌ర్ ఏ.గోపాల‌రావు, కె.ప్ర‌కాష్ తోబాటు, భీశెట్టి బాబ్జి త‌దిత‌ర‌ ప‌లువురు ప్ర‌ముఖులు, క‌వులు,  గుర‌జాడ కుటుంబ స‌భ్యులు పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌‌రం  గురజాడ రోడ్డులోని గుర‌జాడ విగ్ర‌హం వ‌ర‌కూ మ‌హాక‌వి వినియోగించిన వ‌స్తువుల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. అక్క‌డి గుర‌జాడ కాంస్య‌ విగ్ర‌హాం వ‌ద్ద నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ సాహిత్యాన్ని పండిత భాష‌ నుంచి పామ‌రుల చెంత‌కు తెచ్చిన ఘ‌న‌త గుర‌జాడ అప్పారావుకే ద‌క్కుతుంద‌న్నారు. మాజీ ఎంపి బొత్స ఝాన్సీల‌క్ష్మి మాట్లాడుతూ గుర‌జాడ విశ్వ‌క‌వి అని, ఆయ‌న ర‌చ‌న‌లు ప్ర‌పంచానికి ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు. గుర‌జాడ‌ స్ఫూర్తిని కొన‌సాగించేందుకు, ఆయ‌న ర‌చ‌న‌ల‌ను క‌ళాశాల విద్యార్థుల‌కు సైతం మ‌రింత చేరువ చేయాల‌ని సూచించారు. గుర‌జాడ ర‌చ‌న‌ల‌పై లేజ‌ర్‌ షో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే సాంస్కృతిక శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపించామ‌ని ఝాన్సీ తెలిపారు.

Tags: GURAJADA DEATH ANIVERSARYtelugu news
Previous Post

చేయి చేయి కలిపారు.. ‘మార్గం’ చేసుకున్నారు

Next Post

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంట‌లే స‌మ‌యం!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

మంటల్లో పెద్దిరెడ్డి పాపాల ఫైల్స్‌.. అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు..!!

3 నిమిషాల్లో ముగించేసిన కేటీఆర్‌!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist