ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం వైరాలోని పట్టభద్రుల సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు రాములు నాయక్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా.. ఓటర్లకు డబ్బులిస్తామని వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీస్తోంది.
డబ్బుల పంపిణీపై పెద్ద ఎత్తున ఆరోపణలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఓటర్లకు డబ్బులు పంచాలని బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ.
అనుమానం ఉన్న వాళ్లను గుర్తించండి
ఓటర్లను ఏ,బీ,సీ గా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునేవాళ్లను, అనుమానం ఉన్న వాళ్లను గుర్తించండి. వారికి డబ్బులు కూడా ఇద్దాం. భయపడాల్సిన పనేం లేదు. ఖర్చులకు ఉపయోగపడేలా పైసలిద్దాం.
– రామలు నాయక్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్