విశాఖ ఉక్కుకు టీఆర్‌ఎస్ మద్దతుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆంధ్రాలో పోరాటానికి మద్దతిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించడం వెనుక… దురుద్దేశం వేరే ఉందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే టీఆర్‌ఎస్ నాటకాలాడుతోందని ఆరోపించారు. విభజన హామీలపై పోరాడటం చేతకాదులే కానీ, విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.
మోదీ అంటే భయమా? రాజీనా?
కేంద్రంపై టీఆర్‌ఎస్‌కి ఓ స్పష్టమైన వైఖరే లేదన్నారు రేవంత్. గల్లీలోనేమో మోదీని తిడుతున్నారని.. డిల్లీ వెళ్లి వేడుకుని వస్తున్నారని ఎద్దేవా చేశారు. పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై పోరాడుదామంటే.. మొఖం చాటేస్తున్న టీఆర్‌ఎస్ ఆంధ్రాలో ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో పోరాటానికి టీఆర్‌ఎస్ ఎంపీలు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. మోడీ అంటే భయపడుతున్నారా? లేక రాజీ పడుతున్నారా? అనే విషయంపై కేటీఆర్ స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.
తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడరే..
పెరిగిన నిత్యవసరాల ధరస్లు, గ్యా,పెట్రోల్-డీజిల్ ధరలపై పార్లమెంట్‌లో పోరాటానికి టీఆర్‌ఎస్ ఎంపీలు మొఖం చాటేశారు. మీ ఎంపీలు పార్లమెంటుకు ఎందుకు రావడం లేదు? మోడీ అంటే భయపడుతున్నారా… రాజీ పడుతున్నారా?. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై మీరు పోరాడరు కానీ… విశాఖ ఉక్కు కోసం పోరాడతారా?
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ..
– రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ