తెలంగాణలో మరో మంత్రికి కరోనా బారిన పడ్డారు. జ్వరంలో బాధపడుతున్న తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.తొలుత హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె తర్వాత యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆమె ములుగులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆదివారం ఆమెతో కలిసి ప్రచారం నిర్వహించిన నేతలు ఆందోళన చెందుతున్నారు.
Must Read ;- కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..











