ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. సీఎం కేసీఆర్. పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు వెల్లడించారు. తాజా పీఆర్సీతో 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని, కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అయ్యిందన్నారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకి పెంచుతున్నట్టు తెలిపారు.
అందరికీ పీఆర్సీ
ప్రకటన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. అయితే ఏపీలో 27 శాతం పీఆర్సీ ఉండగా, తెలంగాణలో 30 శాతం ఉంది. పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగులు కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!











