రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన విద్యార్థి బోడ సునీల్ పదిరోజుల క్రితం పురుగులమందు తాగాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. సునీల్ ది వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని టేజావత్ రాంసింగ్ తండా. నిరుపేద కుటుంబం. ఎస్సై కావాలనే లక్ష్యంతో కేయూలో సీటు సంపాదించాడు. ఒకవైపు విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే, చదువులో ముందుండేవాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వరంగల్ డాక్టర్లు సునీల్‌కు వైద్యం అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ కు తరలించారు. గత పదిరోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. సునీల్ మరణ వార్తను తెలుసుకున్న కేయూ విద్యార్థులు, నిరుద్యోగులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:అడవిబిడ్డలకు నేటికీ డోలీలే అంబులెన్స్ లు