విశ్రాంతి తీసుకున్నాం.. కొత్త బలం చేకూరింది.. ఇక అరుపులే.. రాజమౌళి మెరుపులే.. అనేలా ట్విట్టర్ లో ఈ చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అదేమీ లేదు.. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది అని చెప్పడమే ఆ ఉద్దేశం. దీనికి సంబంధించిన వీడియోను వారి అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి. దేవీ నవరాత్రులు ప్రారంభం రోజున అంటే ఈ నెల 22న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.
భీమ్ కోసం అల్లూరి సీతారామరాజు వచ్చే సన్నివేశాన్ని నిన్నటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇది కేవలం ఎన్టీఆర్ మీద ఓ వీడియో బైట్ కట్ చేయడం కోసం ఈ షూటింగ్ చేస్తున్నారు. ఈరోజుతో జరిపే షూటింగ్ తో ఇది పూర్తవుతుంది. దీని ఎడిటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తిచేసి ఈ నెల 22న దీన్ని విడుదల చేస్తారు. వారిచ్చిన అప్ డేట్ ప్రకారం చూస్తే టీజర్ కట్ చేయడం కోసం ఎన్టీఆర్ తో పాటు, రామ్ చరణ్ కూడా షూటింగ్ పాల్గాన్నట్టు అనిపిస్తోంది.
ఆ విషయాన్ని అధికారికంగా ఈ రోజు ప్రకటించారు. దాంతో పాటు ఈ ఇద్దరు హీరోలు లేకుండా ఓ పది రోజుల పాటు షూటింగ్ చేస్తారు. ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ను 22న విడుదల చేయడం, సినిమా తర్వాత షెడ్యూల్ ను, ప్రోగ్రెస్ ను వివరించడం ఈరోజు అప్ డేట్ లోని ముఖ్యంశాలు. ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులకు మాత్రం ఇది అదిరిపోయే వార్తగానే భావించాలి. 1920 నాటి కథావస్తువుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ కు దాదాపు ఆరు నెలలు విరామం రావడంతో సామగ్రి అంతా దుమ్ముకొట్టుకుపోయాయి. వాటన్నిటికీ దుమ్ముదులిపే ప్రక్రియ ప్రారంభమైందని వీడియో ద్వారా చెప్పేశారు. ఈ నెల 22న భీమ్ కోసం రామరాజు వస్తున్నాడంటూ ప్రకటించి అనుమానాలకు తెరదించారు. మళ్లీ సెట్స్ మీదకు రావడం ఆనందంగా ఉందని హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశారు. జక్కన్నతో మళ్లీ సెట్స్ పైకి రావడం తనకెంతో సంతోషం కలిగించిందని తారక్ అన్నారు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. మరో కీలక పాత్రను అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిన్ నటిస్తోంది. ఇందులో హాలీవుడ్ నటులు కూాడా ఉంటారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది.
‘జీవితంలో ఒడుదొడుకులు సర్వసాధారణం.. దానికి అనుగుణంగానే మనం ముందుకు పోవాలి.. మా సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది’ అని రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు.
Rested✊🏻
Recharged🔥
Raring to go🌊And that’s how #WeRRRBack!! 🤞🏻https://t.co/h8niWpdmpo @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @dvvmovies #RRRMovie #RRR
— 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 6, 2020
Life has already become a new normal. We have to adapt to it and move on. And so our shoot resumes… 🙂https://t.co/qFlpsIHJpc
Await #RamarajuforBheemOnOct22.. #WeRRRBack.
— rajamouli ss (@ssrajamouli) October 6, 2020
Excited to be back on the sets Jakkana @ssrajamouli ! @AlwaysRamcharan FINALLY bro 👏 Can’t wait!!! #RamarajuforBheemOnOct22 #WeRRRBack https://t.co/xYKi6PdT1M
— Jr NTR (@tarak9999) October 6, 2020
Lovely to be back on the sets of #RRR!
My dear brother @tarak9999, something that was long overdue is getting ready and as promised I am gonna give you the best, this 22nd Oct. https://t.co/yQ2mP1vA4W@ssrajamouli #RamarajuforBheemOnOct22 #WeRRRBack
— Ram Charan (@AlwaysRamCharan) October 6, 2020