ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓ రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నాతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ముస్లీంలలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఓవైసీ చేస్తున్నారని ఆరోపించారు. ముస్లీంలలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఓవైసీ.. మరో జిన్నా అని వివాదాస్పద వ్యాఖ్యలను ఉర్దూ రచయిత మున్నవర్ రాణా చేశారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో మున్నవర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో మహాకూటమి ఓడిపోవడానికి ఎంఐఎం ఒక కారణంగా చూపుతూ ఈ విధమైన ఆరోపణలను చేశారు. భారత్‌లో మరో జిన్నా తయారవ్వడానికి ముస్లీం సమాజం ఏమాత్రం అనుమతించదని ఆయన ఆరోపించారు. బీఎస్పీ ఇతర చిన్నా చితక పార్టీలతో పొత్తుపెట్టుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు స్థానాలను గెలుచుకుని అందరిని ఆశ్చర్య పరిచింది. అంతే కాకుండా ముస్లీం ఓట్లు చీలి అక్కడి మహాకూటమి విజయావకాశాలను పరోక్షంగా దెబ్బతీసిందని మున్నవర్ ఇలా ఆరోపణలు గుప్పించారు.
ముస్లీం వర్గంలో చీలికలు తీసుకొచ్చి బీజేపీ పార్టీకి మేలు చేస్తూ ఆ పార్టీకి ఓవైసీ తొత్తుగా మారాడని మున్నవర్ విమర్శించారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేసినప్పటికినీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అక్కడ ఏకంగా 5 స్థానాలను ఎంఐఎం పార్టీ గెలుచుకుంది. కొన్ని చోట్ల ముస్లీం ఓట్లు చీలి బీజేపీ, జేడీయుకి కలిసివచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి అది దారితీసింది. బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతం, ఇతర కొన్ని నియోజకవర్గాల్లో ముస్లీం ప్రజలు ఎక్కువగ ఉంటారు. ఇది ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. కొన్ని చోట్ల మహాకూటమి అభ్యర్థులు కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలు చాలానే ఉన్నాయి. ముస్లీం ఓట్లు చీలిపోవటంతోటే ఇలా జరిగిందనే ఆరోపణలను ఆయన గుప్పించారు.
AlsoRead ;- మన ఒవైసీ భయ్యా.. ఉత్తరాదిలో బీజేపీ ట్రంప్ కార్డ్!