చరిత్రలో జరిగిన యదార్థ ఘటనలతో “బిందుసార” చాప్టర్-1 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో సత్యమేవ జయతే, 1948 చిత్రాలలో నటించిన ఈశ్వర్ బాబుతో పాటు మానస రెడ్డి, హైమా కె.వీల ప్రధాన పాత్రలు పోషించారు. విశాల్ మంతిన దర్శకత్వం వహించగా, మంతిన వెంకట్ రావు నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన ఈ చిత్రబృందం తాజాగా టీజర్ ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా దర్శకుడు విశాల్ మంతిన మాట్లాడుతూ, “వాస్తవికతకు దగ్గరగా దేశ చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారం చేసుకుని ఫిక్షనల్ గా దీనిని మలుస్తున్నాం. ఇండియాతో పాటు అమెరికా, ఈజిప్టు నేపథ్యం కూడా ఉంటుంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా అందరికీ నచ్చుతుంది“ అని అన్నారు.
నటుడు ఈశ్వర్ బాబు మాట్లాడుతూ,“చరిత్రలో జరిగిన ఘటనల్లో భాగంగా చాప్టర్-1 చిత్రం రూపుదిద్దుకుంది. థ్రిల్లింగ్ అంశాలతో ఉత్కంఠగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని విశ్వసిస్తున్నాం“ అని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో అభిలాష్ అడ్డా, ఉమంత కల్ప, రాయల హరిచంద్ర, ప్రతాప్, భవాని శంకర్, విక్రమ్ ఆదిత్య, అనుషా చౌదరి, సమైరా, ఉమా మహేశ్వర్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: తెరిష్ తేజ, కెమెరా-ఎడిటింగ్: హిమాన్షు గొట్టిపర్తి, మాటలు: రవీణ చవాన్, కేఎస్ఎం నవీన్.
Must Read ;- ఫస్ట్ లుక్ : ‘జ’ అంటూ భయపెడుతోన్న హిమజ











