రెండు రోజుల క్రితమే అదార్ పునావాలా 600 కే ఒక డోసు అందిస్తామని ప్రకటించిన తర్వాత మోడెర్నా కూడా తమ టీకా ధరను ప్రకటించింది. వెనువెంటనే రష్యా స్పుత్నిక్ వి కూడా ధర ప్రకటనకు సిద్ధమైంది. మరి ఏ టీకా ఎంత ధర పలుకుతుందో చూద్దాం రండి…
ఫైజర్ ధరెంతంటే
ఫైజర్ సంస్థ తన టీకా సామర్థ్యం 95 శాతంగా ప్రకటించి సంచలానికి తెర లేపింది. అప్పటి నుండి టీకా సామర్థ్యంపై ప్రపంచం వ్యాప్తంగా కొత్త చర్చలు మెదలయ్యాయి. మరి వారు నిర్ణయించిన ధరెంతో తెలుసా 19.50 డాలర్లు. అంటే కనీసం రెండు డోసులు అవసరం కాబట్టి 39 డాలర్లు ఖర్చవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫైజర్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకు కారణం, 18-65 పైబడిన వారిపైన, అలాగే వ్యాధిగ్రస్తులపైన కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించడంతో ప్రపంచం ఇప్పుడు ఫైజర్ వైపు చూస్తుందని చెప్పచ్చు.
600 వందలకే ఆక్స్ ఫర్డ్ టీకా
వ్యాక్సిన్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఆత్రంగా ఎదురుచూస్తున్న వారికి సరికొత్త వార్తతో ఆశ్చర్యపోయేలా చేశారు సీరమ్ సంస్థ అధినేత అధార్ పూనావాలా. కరోనా టీకా ఒక డోసును 500-600 కే అందించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి రెండు డోసులు తప్పనిసరి కనుక 1000-1200 మించి అవదని చెప్పారు. అంతేనా, ప్రయోగ ఫలితాల ఆధారంగా అవసరమైతే డిసెంబర్ లో ఎమర్జెన్సీ ఉపయోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. టీకా సామర్థ్యం అనుకున్న రీతిలో ఉందని వెల్లడించారు. యువకులతో పాటు, వయసుపైబడిన వారిపైన కూడా టీకా సమర్థవంతంగా పని చేస్తుందని ప్రయోగాలు ద్వారా నిరుపితమవ్వడం ఆనందం కలిగిస్తుందని తెలియజేశారు.
Must Read:-కరోనాకి వ్యాక్సిన్ రాదంటున్న నందమూరి బాలకృష్ణ?
మోడెర్నా టీకా ధర ఎంతో తెలుసా?
మోడార్నా సంస్థ తయారుచేస్తున్న టీకాకు ప్రభుత్వం నుండి 25-40 డాలర్ల వరకు వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది సంస్థ. తాము తయారుచేస్తున్న టీకాను ప్రజలకు సాధారణ ఫ్లూ టీకా ధర అంటే 10-50 డాలర్ల మధ్యలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వెంటనే ఐరోపా సమాఖ్య బేరసారాలు మొదలెట్టింది. 25 డాలర్ల కంటే తక్కువకు ఒప్పుకుంటే మిలియన్లలో డోసులకు ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చింది. ప్రయోగాల మధ్యంతర విశ్లేషణల ప్రకారం టీకా సామర్థ్యం 94.5 శాతంగా ఉన్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Also Read:-కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు గురూ : WHO
మా టీకా ధర తక్కువ
ప్రపంచంలో మొదటి టీకాగా నమోదు చేసుకున్న రష్యాకు చెందిన సుత్నిక్ వి కూడా కచ్చితమైన ధరను ప్రకటించకపోయినా, ఇప్పటికే ధరలు ప్రకటించిన వాటికంటే మా టీకా తక్కువ ధర ఉంటుందంటూ సంస్థ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఇక, ఈ టీకా సామర్థ్యం విషయానికొస్తే, పలు దేశాల్లో మూడో దశ ప్రయోగాల జరుపుకుంటున్న ఈ టీకా మధ్యంతర విశ్లేషణల ప్రకారం 92 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
Also Read:-వృద్ధులకు ఆశాకిరణం.. ఈ టీకా వేసుకుంటే సరి..
చివరి దశకు చేరుకున్న ప్రయోగాలు
అన్ని కంపెనీల టీకా ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో అందరి మదిలో తలెత్తే ప్రశ్నలు టీకా సామర్థ్యం, ధర, ఉత్పత్తి లాంటి వాటి గురించే. వాటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా టీకాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్తున్నారు. కానీ కంపెనీలు వాటి సామర్థ్యం గురించి ఎంత గొప్పగా చెప్పినా, అవి మార్కెట్లోకి వచ్చి జనాలకు ఇచ్చినపుడే వాటి అసలైన సామర్థ్యం, సమస్యలు బయటపడతాయనేది మాత్రం కాదనలేని నిజం.
Also Read:-కరోనా టీకా ఎప్పుడు వస్తుందంటే?











