వ్యాక్సిన్ గురించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, ప్రపంచానికి ఇప్పుడు అది చాలా పెద్ద వార్త. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాక్సిన్స్ ప్రయోగ దశలో ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముందువరసలో ఉన్నది మాత్రం ఫైజర్ అని చెప్పాలి. ఆ తర్వాతి స్థానంలో భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కొవాక్సిన్ గురించే అందరూ చర్చించుకోవడం భారత్‌కు గర్వకారణమనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య 64 దేశాల రాయబారులు కొవాక్సిన్ పనితీరు, సామర్థ్యం, తయారీ పద్ధతులను పరిశీలించడానికి భారత్ బయోటెక్‌ని సందర్శించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా కొవాక్సిన్ గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు.
17 ఓట్లు గెలుచుకున్న ఫైజర్
ఇప్పటికే యుకేలో వ్యాక్సినేషన్ కు అనుమతులు పొందిన ఫైజర్. కెనడాలో కూడా వచ్చే వారం నుండి ఫైజర్ వ్యాక్సినేషన్ మొదలుపెడుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దేశాలతో పాటు, ఎమర్జెన్సీ ఉపయోగానికి అనుమతించాల్సిందిగా అమెరికా ఫుడ్ & డ్రగ్ కంట్రోల్‌కు దరఖాస్తు చేసుకుంది ఫైజర్. అందులో భాగంగా జరిగినా విచారణలో మొత్తం 22 ఓట్లలో, 17 మంది ఫైజర్‌కు అనుకూలంగా ఓట్లు వేయగా, నలుగురు అనుమతించడాన్ని తిరస్కరించారు. మిగిలిన ఒక్కరు ఓటు వేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి అమెరికాలో కూడా ఫైజర్ అధికార టీకాగా పాగ వేయబోతుందని తెలుస్తుంది.
Must Read ;- ఫైజర్ టీకా సామర్థ్యం @ 95
ప్రపంచం మెచ్చిన కొవాక్సిన్
ఫైజర్, కొవిషీల్డ్, సినోఫార్మ్, స్పుత్నిక్ వి.. ఇలా ఎన్ని టీకాలు ఉన్నా, అవన్నీ విదేశీ టెక్నాలజీతో తయారవుతున్న వ్యాక్సిన్లే. కానీ భారత్ బయోటెక్‌లో రూపుదిద్దుకుంటున్న ‘కొవాక్సిన్’ పూర్తి దేశీయ టీకా కావడంతో ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల 64 దేశాల రాయబారులు సందర్శించి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రోగ్రస్‌ను మెచ్చుకోవడంతో, ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వైపు మరలిందని చెప్పుకోవచ్చు. 3వ దశ ప్రయోగాలు కూడా విజయవంతం దిశగా దూసుకుపోవడంతో, త్వరలోనే కొవాక్సిన్‌కు అనుమతులు లభించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.
మేము సైతం
టీకాలు ఎన్ని గుంపగుత్తుగా మార్కట్లోకి రావడానికి సిద్ధమైనా కూడా టీకాని అందరికీ అందిండం ఎలా అనే ప్రశ్న ఇప్పటికీ అన్నీ దేశాధినేతలను కలవరానికి గురిచేస్తుంది. వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో హాస్పిటల్స్ ముఖ్యపాత్ర వహిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ప్రభుత్వం కూడా హాస్పిటల్స్ పైన దృష్టి సారించింది.
తాజాగా అపోలో హాస్పిటల్స్ సంస్థ టీకాను ప్రజలకు అందించడంలో సహకరించడానికి ముందుకొచ్చింది. దేశ వ్యాప్తంగా 71 హాస్పిటల్స్, వందల సంఖ్యలో క్లినిక్స్, వేల సంఖ్యలో ఉన్న ఫార్మసీలు కొవిడ్ టీకాను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు, 6000 సిబ్బందిని టీకా చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు కూడా తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వానికే అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇలా దేశంలోని అన్ని హాస్పిటల్స్ వ్యాక్సిన్ ప్రజలకు అందించడంలో సహకారం అందిస్తే టీకాను సకాలంలో అందిరికీ అందేలా చేయడం సులభమవుతుంది.
భారత్ తోనే సాధ్యం
ప్రపంచంలో ఎన్ని టీకాలు తయారవుతున్నా, అందరి చూపు భారత్ వైపే ఉంది. భారత్ సహకారం లేకుండా టీకా పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యం అనేది చాలా దేశాల ఆలోచన. అంతేకాదు, మిగిలిన అన్నీ దేశాలతో పోలిస్తే, భారత్‌లో తయారైన ‘వ్యాక్సిన్ ధర తక్కువ, సామర్థ్యం ఎక్కువ’ ఉంటుందనే విషయాన్ని ప్రపంచ దేశాలు గట్టిగా నమ్ముతున్నారు. వారి వాదనకు ఊతమిస్తూ, సీరమ్ అధినేత అదార్ పూనావాలా రూ 250 కే ఒక డోసును అందించే ప్రయత్నం చేస్తామని ప్రకటించడంతో దేశ ప్రజల్లో వ్యాక్సిన్ ధర గురించిన ఆందోళన కాస్త తగ్గందనే చెప్పచ్చు.
ఇప్పటి వరకు అన్ని వ్యాక్సిన్లు సామర్ధ్య పరంగా అనుకున్న ఫలితాలు అందిస్తున్నాయి. కాస్త చిన్న సమస్యలు తలెత్తున్నా కూడా వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్ని సంస్థలు ప్రకటించడం ఆనందించదగ్గ విషయం. ప్రపంచలోని ప్రజలందరూ వ్యాక్సిన్ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి త్వరగా రావాలని కోరుకుంటున్నారు.
Also Read ;- ఈ టాబ్లెట్ 24 గంటల్లో కరోనాను కట్టిడి చేస్తుంది