భారత్ లో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. ఈ నెల 16న మొదలైన ఈ కార్యక్రమం.. ఆరోగ్య కార్యకర్తలు ఆసక్తి చూపకపోవడంతో.. మొదట్లో మందకొడిగా సాగింది. ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది. 12వ రోజు బుధవారం నాటికి 23 లక్షల మార్కును దాటింది. 13వ రోజు గురువారం ఏకంగా 4,91,615 మందికి టీకాలు అందించిన అధికారులు.. రికార్డు సృష్టించారు. దీంతో.. మొత్తం 13 రోజులకు గాను 28,47,608 మంది టీకా అందుకున్నట్లయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో ఇప్పటివరకు 1,70,910 మంది టీకా అందుకోగా.. తెలంగాణలో 1,46,665 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 13 రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా టీకాలు తీసుకోగా.. ఏపీ ఆరో స్థానంలోనూ, తెలంగాణ తొమ్మిదో స్థానంలోనూ నిలిచాయి. అత్యధికంగా కర్ణాటకలో 2,84,979 మంది టీకాలు తీసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, బెంగాల్, ఏపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, హరియాణ, బిహార్, కేరళ నిలిచాయి.
Must Read ;- హనుమంతుడు సంజీవని తెచ్చారు.. భారత్ టీకా ఇచ్చింది..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య..













