తిరుపతిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవమానం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యటన నేపథ్యంలో మంత్రి బుగ్గన కూడా తిరుపతికి వెళ్లారు. పర్యటన ముగించుకున్న కేంద్ర మంత్రి తిరుగు పయనమయ్యేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రి బుగ్గన వీడ్కోలు పలికేందుకు వీఐపీ గేట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కేంద్ర భద్రత సిబ్బంది బుగ్గనకు అడ్డుపడి, లోపలికి రాకుండా ఆపేశారు. దీంతో కేంద్రమంత్రికి వీడ్కోలు చెప్పకుండానే వెనుతిరగాల్సి వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన బుగ్గన ఎయిర్ పోర్టు, ఇతర అధికారులపై మండిపడ్డారు. తనను అడ్డుకున్నవారి వివరాలను చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- తిరుపతి రూయా ఘటన ప్రభుత్వ పనితీరుకు అద్దం : నారా లోకేశ్











