పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఆయన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. పవన్ అభిమానులకు ఇది అదిరిపోయే ట్రీట్ అనుకోవచ్చు. ఈరోజు ఉదయం 9.9 గంటలకు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. గాంధీ, అంబేద్కర్ వంటి మహానుభావుల్ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపిస్తూ.. లాయర్ గెటప్‌లో క్రిమినల్ లా పుస్తకాన్ని చేత్తో పట్టుకుని సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చారు పవన్ కళ్యాణ్. ఓ చేతిలో ఉన్న పుస్తకానికీ, ఇంకో చేతిలో ఉన్న కర్రకూ ప్రత్యేక అర్థం ఉన్నట్టే ఉంది. చట్టానికీ, న్యాయానికీ ఉన్న తేడాని దర్శకుడు ఈ సినిమాలో చూపనున్నట్లు అర్థమవుతోంది. హిందీ పింక్ కూ ఈ సినిమాకూ తేడా ఉన్నట్టే ఉంది.
చేతిలో క్రిమినల్ లా బుక్ పట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని వకీల్ సాబ్.. నేరస్థుల కీళ్లు విరిచేందుకు సిద్ధం అన్నట్లుంది. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో సత్యమేవ జయతే అనే మాట వస్తుంది. ఈ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ హైప్ ని ఈ వాక్యం మరింత పెంచింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం, తమన్ సంగీతంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్‌గా కనిపించబోతుండగా.. నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.