వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. వీపీఆర్.. నెల్లూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి ఈయన పేరు సుపరిచితం.. నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఆయన ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసించగల సత్తా ఆయన సొంతం.. పారిశ్రామిక వేత్తగా వేల కోట్లు గడించారు.. అర్ధ బలంతోపాటు అంగబలం కూడా ఆయన సొంతం. ఇక, జిల్లా వ్యాప్తంగా ఆయన చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామానికీ చేరుతాయని చెబుతారు.. అందుకే, సింహపురి జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రూటే సెపరేటు అని చెబుతారు.. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారో లేదో, ఆయన కోసం చంద్రబాబు నెల్లూరు వెళ్లి మరీ కండువా కప్పారు.. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం ప్రకటించారు.. వేమిరెడ్డి లాంటి వ్యక్తి కోసం తానే నెల్లూరు వచ్చానని వివరించారు.. అంతటి వ్యక్తిత్వం, రాజకీయ విలువలు, ఉన్నత ఆశయాలు, ఆలోచనలు ఆయన సొంతం..
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. గత అయిదేళ్లుగా జగన్ రాజకీయాలతో విసిగిపోయారని చెబుతారు.. ఆయనకి సరైన గౌరవం, విలువ ఇవ్వకుండా.. జగన్ ఓ నియంతలా వ్యవహరించారని, ఇటు పాలనా పరంగా కూడా జగన్ అభివృద్ధికి ఆమడ దూరం నిలవడంతో వేమిరెడ్డి పునరాలోచనలో పడ్డారనే కామెంట్స్ ఉన్నాయి.. అందుకే, ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ సవారీకి రెడీ అయ్యారని ఆయన సన్నిహితులు చెబుతారు..
వైసీపీకి గుడ్ బై చెప్పే ముందు ఏపీ రాజకీయాలలో తాజా పరిస్థితులపై వేమిరెడ్డి మూడు టీమ్‌లతో పలు మార్లు సర్వేలు చేయించుకున్నారట.. ఈ సర్వేలలో జగన్ ఓటమి ఖాయమని, వైసీపీకి 40-50 స్థానాలలోపు వస్తాయని తేలడంతోనే ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట.. చంద్రబాబు – పవన్ మరింతగా కష్టపడి, టీడీపీ – జనసేన మధ్య ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరిగితే, వైసీపీ 25లోపు స్థానాలకు పరిమితం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వేమిరెడ్డి చేయించిన రెండు సర్వేలలో తేలిందని నెల్లూరు జిల్లా రాజకీయాలో దుమారం రేపుతోంది..
మొత్తమ్మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేత వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీపై ఓటర్లలో నెగిటివ్ సంకేతాలను పంపింది..ఇదే టీడీపీకి కలిసివస్తోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా సింహపురిలో సైకిల్ డబుల్ స్పీడ్‌తో గేర్ మార్చి తొక్కుకుంటూ పోవడం ఖాయమని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలున్నాయి.. వైసీపీకి ఒకటి రెండు మించి స్థానాలు దక్కడం అనూహ్యమని, పదికి పది టీడీపీ ఖాతాలో పడిపోవడం ఖాయమని తేల్చి పారేస్తున్నారు కొందరు రాజకీయ నిపుణులు.. వేమిరెడ్డి సర్వేలలోనూ ఇదే తేలిందట.. ఇటు, ఆయన ఎంట్రీ కూడా ఈ పబ్లిక్ టాక్‌కి కలిసి వస్తుందని చెబుతున్నారు.. మరి, ఏం జరుగుతుందో చూడాలి.











