బెజవాడ దుర్గగుడిలో అవినీతి కంపు మరోసారి బయటపడింది. ఇప్పటికే దుర్గగుడిలో అవినీతిపై ఏసీబీ దాడులు జరిపి 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేసింది. అయినా దుర్గగుడిలో అవినీతికి అడ్డుకట్ట పడలేదు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై మీడియాలో కథనాలు రావడంతో విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. 11 మంది అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఇంద్ర కీలాద్రి, జమ్మిదొడ్డి కార్యాలయాల్లో వివరాల సేకరిస్తున్నారు. దుర్గగుడిలోని అన్నదానం, స్టోర్స్, చీరల విభాగాల్లో విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈవోపై వేటు పడే అవకాశం
దుర్గగుడిలో అవినీతికి పాల్పడుతున్న తిమింగలాలను వదిలేసి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. దుర్గగుడి ఈవో సురేష్ బాబు వాయిస్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దుర్గగుడిలో అడుగడుగునా అవినీతి జరుగుతున్నా, దీనికి ఈవో సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా అవినీతికి చెక్ పెట్టలేకపోతున్నారు. అయితే దుర్గగుడిలో అనేక సంవత్సరాలుగా తిష్ట వేసిన అధికారులపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. పరిశీలీన పూర్తయిన తరవాత గట్టి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- కనకదుర్గ గుడిలో దండుపాళ్యం గ్యాంగ్ చేరింది.. పోతిన మహేష్











