యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో చెర్రీతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. దీని తర్వాత తారక్.. త్రివిక్రమ్ సినిమాకి రెడీ అవుతాడు. ఆల్రెడీ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వచ్చేసింది కూడా. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత తారక్ .. ఓ అద్భుతమైన స్టోరీ లైన్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఆమిర్ ఖాన్ ‘దంగల్’ తరహా పాత్రలో తారక్ నటిస్తాడని సమాచారం. ఇంతకీ తారక్ ను ఆ పాత్రలో చూపించబోయే దర్శకుడు మరెవరో కాదు.. ‘ఉప్పెన’ బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో దర్శకుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు.. ఇటీవల యన్టీఆర్ ను కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. ఓ 60 ఏళ్ళ రిటైర్డ్ అథ్లెట్.. తాను సాధించలేని ఓ డ్రీమ్ ను .. తన శిష్యుడితో నెరవేర్చుకుంటాడట. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమాతో దీనికి పోలికలు కనిపిస్తున్నా.. ఈ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోతున్నాడట బుచ్చిబాబు.
త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే యన్టీఆర్ బుచ్చిబాబు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని ఆత్రుతతో ఉన్నాడట. కథాంశం తనకు చాలా బాగా నచ్చడంతో తారక్ ఈ సినిమాను సాధ్యమైనంత త్వరలో చేసేయాలని అనుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. యన్టీఆర్ పాత్ర గురించి .. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.
Must Read ;- యన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా లంకేశ్?