జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందునుండి విజయశాంతి బీజేపీ చేరుతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంది. విజయశాంతి కూడా ఢిల్లీ వరకు వెళ్లి మరీ బీజేపీ పెద్దల వద్ద అటెండెన్స్ వేయించుకోని వచ్చింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల బరిలో విజయశాంతి ప్రచారం చేయబోతున్నారని కూడా చెప్పారు. తర్వాత అసలు చేరుతున్నారా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. వాటికన్నింటికీ తెరదించుతూ నేటికి ముహుర్తం కుదిరి కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కాషాయ కండువాతో విజయశాంతికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం కోసం నిన్ననే ఢిల్లీ చేరుకుని అమిత్ షాను కలిసి, ఆపై పలువురు పార్టీ నేతల సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను బీజేపీ 1998 లో చేరిన విషయం గుర్తుచేశారు. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా విజయశాంతి టీఆర్ ఎస్ ని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. కరోనాతో కేసీఆర్ ని పోల్చుతూ తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం విధితమే.
Must Read ;- కేసుల్లో ఉన్న కొత్త కార్పొరేటర్లు.. బీజేపీ వారే ఎక్కువ