రామతీర్థంలోని రాముని శిరస్సును కొందరు దుండగులు ఖండించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన చాలా రగడ జరగడంతో ముఖ్యమంత్రి కూడా స్వయంగా స్పందించి దేవుడు శిక్షస్తాడని చెప్పుకొచ్చారు సిఎం. దుండగులను పట్టుకుని శిక్షించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన మరవకముందే రాజమండ్రిలో మరొక దారుణ సంఘటన వెలుగుచూసింది. విఘ్నేశ్వర స్వామి విగ్రహంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి చేతులను ధ్వంసం చేశారు. కావాలనే చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
ఇలా వరస దాడులు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. రామతీర్థం ఘటన విషయంలో చంద్రబాబు, లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి నాయకుల కనుసన్నల్లో రామతీర్థం ఘటన జరిగిందంటూ ఆరోపించారు. ఘటన జరగడానికి ముందురోజు టీడీపీకి చెందినవారు కొండపైకి వెళ్లినట్టు ఆధారాలున్నాయంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. వాటితో బాధ్యలను శిక్షించి తీరుతామంటున్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ఒక కుట్రదారుడని ఆరోపించారు విజయసాయి రెడ్డి.