బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ .. అమితాబ్ బచ్చన్ న్యూ ఇయర్ వేడుకులను తన ఇంటిలో అత్యంత అట్టహాసంగా జరుపుకున్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి భార్య జయ బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ తో కలిసి అమితాబ్ 2020వ సంవత్సరానికి వీడ్కోలు పలికి న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. కరోనా కారణంగా బయటకు వెళ్లకుండా కుటుంబం మొత్తం ఇంటిలోనే ఉండి వేడుకలను జరుపుకున్నారు.

పాత పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించారు అమితాబ్. మనవరాలు ఆరాధ్యతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు బిగ్ బి. ఆ ఫోటోలలో అమితాబ్ గోల్డ్ కలర్ టోపీ పెట్టుకొని దానిపై హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఉన్న ఒక బ్యాండ్ ను కూడా ధరించారు. అలాగే రంగు రంగుల కళ్ళజోడు పెట్టుకొని చిన్న పిల్లాడిగా మారిపోయారు బిగ్ బి. ‘మీకు 2021లో శాంతి, ప్రేమ, సామరస్యం కలగాలి’ అని పోస్ట్ చేశారు. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా వారు జరుపుకున్న న్యూ ఇయర్ వేడుకులకు సంబంధించిన పోటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో కుటుంబ సభ్యులందరూ రంగు రంగుల బట్టలు , ఫాన్సీ టోపీలు ధరించి కలర్ ఫుల్ గా ఉన్నారు. ఫొటోలతో పాటు ‘మీకు 2021లో ఆ దేవుడు ప్రేమ, శాంతి, సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమితాబ్ అభిమానులు పెద్ద ఎత్తున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.










