తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ తర్వాత వీఆర్సీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అనిల్, గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్ తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే నామినేషన్ వేసే సమయంలో, కలెక్టరేట్‌లోకి పోలీసులు ముగ్గురిని మాత్రమే అనుమతించారు. కొవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అయితే గురుమూర్తి ఉదయం 9.30లకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఆలస్యం కావడంతో మంచి ముహుర్తం చూసుకొని నామినేషన్ వేశారు.
Must Read;- వైసీపీకి దిమ్మతిరిగే షాక్ : వాట్సాప్ చేస్తే, 10 వేలు