విరుష్క అభిమానులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శుభవార్త చెప్పారు. తమకు కుమార్తె పుట్టిందని వెల్లడించారు. ఈ మేరకు కోహ్లి ట్వీట్ చేశారు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యారు. అతడి సతీమణీ అనుష్క శర్మ సోమవారం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్న కోహ్లీ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
— Virat Kohli (@imVkohli) January 11, 2021
“ఈ మధ్యాహ్నం మా జీవితంలోకి పాప అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మా గోప్యతకు మీరంతా గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను”
– విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
విరుష్క జంట ఒక యాడ్ షూటింగ్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. 2017 డిసెంబర్ 11న ఇటలీలో అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆగస్టు 27న సామాజిక మాధ్యమాల ద్వారా తమకు జనవరిలో బిడ్డ పుట్టబోతున్నట్లుగా ఈ జంట ఓ అధికారక ప్రకటన విడుదల చేశారు. అనుష్క గర్భవతి అయిన దగ్గరి నుంచి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
Must Read ;- అనుభూతికి అర్థం తెలిసిందంటున్న అనుష్కా శర్మ !