కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్. కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికే దీని బారిన పడి చనిపోయినవాళ్లు ఉన్నారు. ఇది చాలదన్నట్లు మరో కొత్త వైరస్ ముంచుకొస్తోంది. అదే వైట్ ఫంగస్. బీహర్ పట్నా మెడికల్ కాలేజీలో నలుగురు వైట్ ఫంగస్ తో బాధపడుతున్నట్లు తేలింది. కరోనా నెగిటివ్ అని తేలినా.. కొవిడ్ లక్షణాలు మాత్రం ఉన్నాయట. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైనది డాక్టర్లు గుర్తించారు.
లక్షణాలు ఇవే..
నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. సైనస్ వాపు, గొంతునొప్పి ఉంటుంది. జననేంద్రియాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పేగులకు ఫంగస్ ఇన్‌ఫెక్ట్ అయితే మలబద్ధకం, గ్యాస్, డయేరియా లక్షణాలు ఉంటాయి. బాహుమూలాలు, మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, నోరు, కళ్లు, ముక్కు, మెదడు వంటి భాగాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మగవాళ్లతో పోల్చితే మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని పలువురు పేర్కొంటున్నారు.
Must Read ;- భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. తెలంగాణాలోనూ వెలుగులోకి