మహారాష్ట్రలో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు విదర్భలోని ఓ గ్రామ సమీపంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకొని కార్యాకలపాలు కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న కమాండోలు పకడ్బందీగా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో మావోయిస్టులు తేరుకొని ప్రతిఘటించారు. కమాండోల భారీ ఎన్ కౌంటర్ కారణంగా 13 మంది మావోలు చనిపోయారు. అనంతరం పేలుడు పదార్థాలు, తుపాకీలు, ఇతర సామాగ్రిని కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో కరోనా ఎఫెక్ట్ మావోయిస్టులపై పడింది. కరోనాతో ఒకరిద్దరు ఇప్పటికే జనజీవన స్రవంతితో కలిశారు. ఇందుకు ఇష్టం లేని కొందరు మావోయిస్టులు రహస్య ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు.
Must Read ;- ఇజ్రాయెల్-పాలస్తీనా.. ప్రతిసారి యుద్ధ నినాదమే











