బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున మళ్లీ తళుక్కుమన్నారు. వైల్డ్ డాగ్ షూటింగ్ నుంచి ఆయన డైరెక్టుగా వచ్చేసినట్టుంది. రావడమే కాదు. బయటికి వెళ్లిపోయిన నోయల్ ను వేదికపైకి పిలిచాడు. తన కెరీర్ కంటే బిగ్ బాస్ ముఖ్యం కాదని, అందుకే వెళ్లిపోవలసి వచ్చిందని నోయల్ వివరణ ఇచ్చాడు. వెళుతూ ఊరుకోలేదు.. అమ్మ రాజశేఖర్ మీద బురద జల్లి మరీ వెళ్లాడు. అతనికి అవినాష్, అమ్మ రాజశేఖర్ లంటే ఎక్కడలేని కోపం. తనను అవమానించారన్నది అతని ఆరోపణ. హౌస్ లో ఉన్నప్పుడు నోరు మెదపకపోయినా బయటికి వచ్చాక మాత్రం నోరు పారేసుకున్నాడు.
ఇలా అతను నోరు పారేసుకోవడం వెనక కూడా గేమ్ ప్లాన్ లో భాగమేననే వారు కూడా ఉన్నారు. బయటికి వచ్చాక అతను ఇంతలా రివర్స్ కావడం ఏమిటని అందరూ షాక్ తిన్నారు. నోయల్ కు ఇష్టమైన వారెవరంటే హారిక, అభిజిత్, లాస్య. హారికకు అతన్ని చూస్తుంటే వాళ్ల డాడీలా అనిపిస్తాడట. వీళ్లను సేవ్ చేయడమే తన లక్ష్యం అంటూ నోయల్ ప్రకటించేశాడు. నేను బయట ఉన్నా ఒక్క భుజంతో నిన్ను నడిపిస్తా అంటూ అభిజిత్ కు నోయల్ భరోసా ఇచ్చేశాడు. తన వాళ్లను సేవ్ చేయడం కోసం మిగతా వాళ్లపై నోయల్ బురద జల్లుతున్నాడని ఆరోపించేవారూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా నోయల్ పై ఎదురుదాడి మొదలైంది.
ఇక ఎలిమినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే అఖిల్, లాస్య సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు రాత్రే స్పష్టమైంది. మిగిలిన నలుగురిలో అరియానా కూడా ఈరోజు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. ఇక మిగిలిందల్లా అమ్మ రాజశేఖర్, మోనాల్, మెహబూబ్. వీరిలో మోనాల్ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి అమ్మ రాజశేఖర్, మెహబూబ్ లలో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావడానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊరట ఏమిటంటే ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ లేదు. కాబట్టి సస్పెన్స్ వచ్చే వారానికి షిఫ్ట్ అయినట్లే.











