ఏసీబీ యాప్ వెనుక జగన్ ఆలోచన ఆదేనా ? మండలానికో ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వెనుక దాగున్న కుట్రకోణం ఏమిటి ? అవినీతి రహిత ఆంధ్ర ప్రదేశ్ గా రూపుదిద్దాలనే జగన్ ఆలోచనలో చిత్తశుద్ది ఉందా ? అవినీతిని అరికట్టాలి అనే ఆలోచన జగన్ కు ఇంత అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది ?
రాష్ట్రంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి..అందుకోసం దిశ మాదిరిగా ఏసీబీకి ఒక ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయాలి.. ప్రజల్లో యాప్ పై అవగాహన కల్పించి , అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలలో ప్రక్షాళణ చేపట్టాలి.. ఇది సిఎం జగన్ తాజాగా హోం శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు చేసిన దిశా నిర్దేశం. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి అవినీతి రహిత ఆంధ్ర ప్రదేశ్ అనే ఆలోచన స్వాగతించదగ్గదే అయినప్పటికీ.. జగన్ తీసుకొచ్చిన ప్రతిపాదనల వెనుక భారీ కుట్ర కోణం దాగుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పీఆర్సీ, సీపీఎస్ వంటి అంశాలతో జగన్ పై ఉద్యోగుల్లో వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలోనే వారందరినీ తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు ఏసీబీని పావులా వాడాలనే ఆలోచనలో జగన్ ఉన్నారనే చర్చ జోరందుకుంది. ఇక మండల స్థాయిల్లో ఏసీబీ స్టేషన్లు ఏర్పాటు చేయడం వెనుక ప్రజా ప్రయోజనం కంటే , రాజకీయ కుట్రే ఎక్కువగా దాగుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఏసీబీ పని చేసేది ప్రభుత్వ శాఖలలో జరిగే అవినీతి పైనే.. ఈ క్రమంలో ఏసీబీని అడ్డం పెట్టుకుని జగన్ ఉద్యోగులను టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.సినిమా టికెట్ ధరల వ్యవహారంలో ఓ జీవోను తెచ్చి పరిశ్రమను ఎలా తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకున్నా అని చూపించుకున్నారో..ఉద్యోగుల విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాతలుగా కనిపిస్తోందట.అందులో భాగంగానే మండల స్థాయిలో ఏసీబీ స్టేషన్ లు ఏర్పాటు చేసి ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని కొందరు చర్చించుకుంటున్నారు. మండల స్థాయిలో ఏసీబీ స్టేషన్ ఏర్పాటు చేసి అన్ని వ్యవస్థలలోని ఉద్యోగుల పైన ప్రత్యేక నిఘా పెడితే ఆ భయానికైనా వారంతా తనకు అనుకూలంగా మారుతారనేది జగన్ ఆలోచనట.
మరోవైపు దిశ మాదిరిగానే ఏసీబీకి ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చి అవినీతి నిర్మూలన చేయాలనే జగన్ ఆలోచన పైనా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అవినీతి రహిత రాష్ట్రంగా తయారు చేయడం ఆచరణ సాధ్యమే అయినప్పటికీ.. జగన్ లో ఏ మేరకు ఆ చిత్తశుద్ది ఉంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. అదేసమయంలో గతంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఒక ప్రకటనని కొందరు ఉదహరిస్తున్నారట.అవినీతి, అక్రమాలకు పాలపడుతున్నారని ఒక మంత్రి పై ఇదే ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు జగన్ ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే , ఫోన్ ఎత్తే దిక్కు లేదన్న ఆయన మాటలను గుర్తుచేస్తున్నారట. ఒక మాజీమంత్రి ఫోన్ చేస్తేనే స్పందన లేనప్పుడు సామాన్యుడు చేస్తే ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారట. ఈ నేపధ్యంలోనే జగన్ కు అవినీతిని అరికట్టాలి అనే ఆలోచన ఇంత అకస్మాత్తుగా రావడానికి ప్రజా ప్రయోజనాలు కాదు, కేవలం తాను రాజకీయంగా పొందాలనుకుంటున్న లబ్ధి అనే కుట్ర కోసమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారట.











