సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా సంక్రాంతికి రానున్నాయి. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ క్రేజీ మూవీ దసరాకి విడుదల కావాలి కానీ.. వాయిదా పడింది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుందని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రాజమౌళి గతంలో సంక్రాంతికి ఆల్రెడీ భారీ సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి కాబట్టి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసి వాటిని డిస్టర్బ్ చేయను అని చెప్పారు కానీ.. ఆర్ఆర్ఆర్ మూవీకి సంక్రాంతి సీజనే కరెక్ట్ అని ఆలోచనలో పడ్డారట. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. అదే కనుక జరిగితే.. సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారడం ఖాయం.
అయితే.. ఇన్ని భారీ సినిమాలు వస్తే.. థియేటర్స్ ప్రాబ్లమ్ వస్తుది. అందుచేత ఏదో సినిమా రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రాధేశ్యామ్ సంక్రాంతి పోటీ నుంచి తప్పుంకుటుందా..? లేక మహేష్ సర్కారు వారి పాట తప్పుకుంటుందా..? అనేది ఆసక్తిగా మారింది. అసలు.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మరి.. త్వరలోనే జక్కన్న ఆర్ఆర్ఆర్ విడుదల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ 5 స్టేజ్ పై చెర్రీ ఆర్ఆర్ఆర్ ముచ్చట్లు











