Ramcharan On Biggboss Stage :
టాలీవుడ్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇంకా చెప్పాలంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దర్శకధీరుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారు..? ఎలా ఉండబోతుంది సినిమా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే.. బిగ్ బాస్ 5 ఆదివారం ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి సందడి చేశారు. అందరిలో జోష్ నింపారు. అయితే.. ఇక్కడ ఆర్ఆర్ఆర్ ప్రస్థావన వచ్చింది. ఆర్ఆర్ఆర్ గురించి చెప్పమని అడిగితే.. ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాని పూర్తిగా చూడలేదు. డబ్బింగ్ చెప్పాను. కానీ నేను డబ్బింగ్ చెప్తున్న సీన్లు మాత్రమే చూపించారు రాజమౌళి. సినిమా కానీ, పాటలు కానీ.. ఇంత వరకు చూపించలేదు అని రామ్ చరణ్ చెప్పారు. అయితే.. ఒకటి మాత్రం చెప్పగలను ఆర్ఆర్ఆర్ మనందరం గర్వపడేలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అన్నట్టుగా ఉంటుందన్నారు.
రాజమౌళి తాను విజన్ కి తగ్గట్లు సినిమా తీస్తూ వెళతారు. ఆ తర్వాత ఎడిటింగ్, గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ అవుతాయి. అవన్నీ అయ్యాకే చూస్తేనే రాజమౌళి పూర్తి మ్యాజిక్ అర్థం అవుతుంది. అందుకే.. ఆ టాప్ డైరెక్టర్ తన సినిమాల విజువల్స్ ని గ్రాఫిక్స్ పూర్తి అయ్యాకే చూపిస్తారు. అయితే.. చరణ్ మాటలతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరగడంతో పాటు అభిమానుల్లో మరింత ఆతృత పెరిగింది. 2022 ఏప్రిల్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ లో చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ ముందు హాట్ సీటులోకి దర్శక దిగ్గజాలు











