గుంటూరులో వ్యవసాయశాఖ ఉద్యోగిని ఉమాదేవి ఆత్మహత్య సంచలనంగా మారింది.గుంటూరు సిటీలోని భూసార పరీక్షల కేంద్రంలో ఆమె పని చేస్తున్నారు.ఇవాళ కార్యాలయానికి వచ్చిన ఉమాదేవి,ఒంటిపై యాసిడ్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఉమాదేవి తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఉమాదేవిని జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందించినా ప్రయోజనం దక్కలేదు.ఉమాదేవి మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..
ఉమాదేవి కుమారుడు బాజీ కిరణ్ ఇటీవల కరోనాతో చనిపోయాడు.తరవాత కోడలికి ఉమాదేవికి ఆస్తి వివాదాలు ఏర్పడ్డాయి.గుంటూరులోని నగరపాలెం స్టేషన్లో ఉమాదేవి కోడలు ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి పోలీసులు ఉమాదేవిని విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆమె వాపోయారు.పోలీసులు తన కోడలి తరపున మాట్లాడుతున్నారని,ఆమెకే వత్తాసు పలుకుతున్నారని ఉమాదేవి వెల్లడించారు.పోలీసుల వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆమె తెలిపారు.
Must Read ;- జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కలకలం : దంపతుల ఆత్మహత్యాయత్నం










