మున్సిపల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్‌లు బాహాబాహికి దిగారు.అభివృద్ధి పనులకు సంబంధించి వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డికి, 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో వైస్ చైర్మన్ బంగారు ముని రెడ్డికి మద్దతుగా మరో వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవిలు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషపై దాడికి యత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.ఇక కౌన్సిల్ హాల్‌లోనే కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుని బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....