సాక్షి డిబేట్‌లో జరిగిన రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.. ఈ ఎపిసోడ్‌కి త్వరగా ఎండ్ కార్డ్ వేయాలని వైసీపీ ఎంతమాత్రం భావించడం లేదు.. దానిని కొనసాగించడానికే ఆ పార్టీ, ఆ పార్టీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని, అది పక్కా వ్యూహాత్మకంగానే సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అది ఆ పార్టీ స్ట్రాటజీ అని క్లియర్‌గా అర్ధం అవుతోందని విశ్లేషిస్తున్నారు..
అమరావతి వే*శ్యల రాజధాని కామెంట్‌ని వైసీపీ హైకమాండ్ పక్కా వ్యూహాత్మకంగా అనిపించినట్లు సంకేతాలు అందుతున్నాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.. కొమ్మినేని, కృష్ణం రాజు మధ్య జరిగిన డిబేట్‌లో సడెన్‌గా అమరావతి టాపిక్ రావడం, దానిపై సభ్య సమాజం ఛీత్కరించుకునేలా చర్చ జరగడం, తాజాగా ఆ పార్టీ నెంబర్ 2, జగన్ కోటరీలో కీలక సభ్యుడు సజ్జల కూడా ఈ ఎపిసోడ్‌పై ఎలాంటి పశ్చాత్తాప కామెంట్స్ చేయకపోవడం చూస్తే అంతా పకడ్బందీ వ్యూహంలా కనిపిస్తోంది..
అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయడంతోపాటు ఈ ఎపిసోడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరిగితే ఆ రగడ కారణంతో, ఏపీలో అశాంతి, అల్లర్లు జరిగేలా పక్కా స్కెచ్ వేశారని తెలుస్తోంది.. అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌ని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే, దానిని ఎలా నాశనం చేయాలో అని వైసీపీ నేతలు వ్యూహాలు రచించినట్లు అర్ధం అవుతోంది..
ఇది పక్కా స్క్రిప్ట్ అని భావిస్తే, జగన్ టీమ్ ఆశించినట్లు రచ్చ జరుగుతోంది.. మీడియా, సోషల్ మీడియా ఫోకస్ అంతా ఈ ఘటనపైనే ఉన్నాయి.. అంటే, ఏపీలో ఎంతటి ఘోరాలు జరిగిపోతున్నాయో, అరెస్ట్‌లు, దానికి ప్రతిఘటనలపై మీడియా ఫోకస్ ఉండాలని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారనుకోవాలి.. చంద్రబాబు ఏడాది పాలనపై జరిగిన అభివృద్ధి, ఇటు అమరావతి రాజధానిలో జరుగుతోన్న డెవలప్‌మెంట్, పోలవరం నిర్మాణం దూకుడు, సంక్షేమ పథకాల చర్చ అంతా ఈ ఘటనతో ఆవిరి అవ్వాలి.. ఇదే వైసీపీ యాక్షన్ ప్లాన్‌లా, బ్లూ ప్రింట్‌లా కనిపిస్తోంది.. అందుకే, కొమ్మినేని, కృష్ణం రాజు వ్యాఖ్యలని తప్పు పట్టే అవకాశం వచ్చినా, ఖండించే చాన్స్ ఉన్నా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు..
జగన్ తాజాగా చేసిన ట్వీట్‌లో ఎక్కడా ఆ ఇద్దరి చర్చపై చిన్న కామెంట్ చేయలేదు.. కక్షతో కొమ్మినేని అరెస్ట్ చేశారని ఆయన వాదిస్తున్నారు కానీ, తప్పు ఒప్పులపై ఒక్క మాట మాట్లాడలేదు.. అంటే, జగన్ పక్కా స్ట్రాటజీతోనే ఈ వ్యాఖ్యలు చేయించారని భావించాలా.? ఆ పార్టీ వ్యూహం, విధానం ఇదే అని సంకేతాలు పంపుతున్నారా.? అందులోనూ అమరావతి అంశంపై ఆయన కించిత్ స్టేట్ మెంట్ ఇవ్వలేదు.. అంటే, కొమ్మినేని – కృష్ణం రాజు సంవాదానికి బ్లూ ప్రింట్ తాడేపల్లి ప్యాలెస్‌లోనే రెడీ అయిందని ఊహించుకోవాల్సి వస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..
అయితే, తాము ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలిచినట్లు.. ఈ ఎపిసోడ్‌లో జగన్, ఆయన పార్టీ అడ్డంగా బుక్ అయ్యారు. ఊహించనంత, కోలుకోలేనంత డ్యామేజ్ జరిగింది, జరుగుతోంది వైసీపీకి.. ఆ విషయం జగన్‌కి అర్ధం అవుతోంది.. కానీ, ఎలా వెనక్కి రావాలో తెలియడం లేదు.. స్వయానా సా*క్షి చానెల్‌లో జరిగిన డిస్కషన్ అది.. ఆ చానెల్‌కి ఫేస్ అయిన కొమ్మినేని చేసిన డిబేట్ అది.. ఆ పార్టీ భావజాలాన్ని ఔపాసిన పట్టిన జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసని కామెంట్స్ అవి.. దీంతో, వెనక్కి వెళ్లలేక ముందుకి కదల్లేక ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది జగన్ పరిస్థితి.. మరి, దీని నుండి ఆయన ఎలా బయటపడతారో చూడాలి..











