యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా భీష్మ. లాస్టియర్ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ నమోదు చేసుకుంది. నితిన్ కెరీర్ లోనే హైయస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సినిమా గా నిలిచిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో చక్కటి కుటుంబ కథతో హిలేరియస్ నెరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వెంకీ. అందుకే త్వరలో వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుందనే వార్తలొస్తున్నాయి.
ఇటీవల వెంకీ కుడుముల నితిన్ కలిసి.. ఓ కథ వినిపించాడట. ఆ కథ నితిన్ కు బాగా నచ్చిందట. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా వెంకీ ఆల్రెడీ కంప్లీట్ చేశాడట. ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ నుంచి బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇంకా వెంకీ దీనితో పాటు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓ కథ వినిపించాడని ఆ కథ కూడా చిరుకి బాగా నచ్చిందని వార్తలొస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో వెంకీ ముందుగా ఎవరి సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.
Also Read : పెళ్లైతే బతుకు బస్టాండే అంటున్న నితిన్











