మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం “క్రాక్” పాటలతో సహా ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా..గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా నూతన ఏడాదిలో రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రమోషన్ ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే “భూమ్ బద్దల్’` అనే ప్రత్యేక పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రవితేజతో కలిసి అప్సరా రాణి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. కాగా తాజాగా `’బల్లేగా తగిలావే బంగారం’` అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవితేజ, శృతిహాసన్ మీద చిత్రీకరించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, తమన్ బాణీలు అందించారు. అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. రాజు సుందరంనృత్యరీతులు సమకూర్చారు.
“భూమ్ బద్దల్” పాటకు ఏ స్థాయి ఆదరణ లభించిందో .తాజాగా విడుదల చేసిన “బల్లేగా తగిలావే బంగారం” ఆన్ లైన్లో వైరల్ గా మారిందని చిత్రబృందం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారం చేసుకుని, అన్నితరగతుల ప్రేక్షకులను అలరింపజేసేవిధంగా ఈ చిత్రాన్ని మలిచామని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: ఎస్. తమన్. సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు, కూర్పు: నవీన్ నూలి, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి, నిర్మాత: బి.మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
Must Read ;– .రవితేజ ద్విపాత్రాభినయంతో ఖిలాడి