ఎంతో ఉత్సాహంగా మొదలైన కొత్త శతాబ్దం 2020, కరోనా వల్ల కాలగర్భంలో కలసిపోయింది. కనీసం వచ్చే సంవత్సరం 2021 అయినా బాగుండాలని కొరుకుంటూ కొత్త సంవత్సరంలో సరికొత్తగా ఆరంభించాడానికి ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో 2020 లోని విశేషాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జనాలు ఎక్కువగా గూగుల్ చేసిన వ్యక్తుల గురించి గూగుల్ ఒక లిస్ట్ విడుదల చేసింది. అందులో టాప్ 10 లో దాదాపు 7 గురు భారతీయులు ఉండగా.. మరో ఇద్దరు భారతీయ సంబంధాలు ఉన్నాయి. మరి ఆ టాప్ 10 లిస్టేమిటో చూద్దాం రండి..
జో బైడెన్

గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో అగ్రరాజ్యాధినేతగా గెలుపొందిన జో బైడెన్ నిలిచారు. అవునండీ.. మీరు విన్నది నిజమే! అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ని వెనక్కునెట్టి వైట్ హౌస్ అధికారాలు దక్కించుకున్న బైడెన్ కోసం ప్రజలు బాగా వెతికేశారట. అందుకే గూగుల్ వెతుకులాటలో నెం:1 స్ధానాన్ని దక్కించుకున్నారు.
Must Read ;- కష్టాలకు ఎదురీదిన ధీరుడు.. పట్టువదలని విక్రమార్కుడు జో బైడెన్
ఆర్నాబ్ గోస్వామి

బైడెన్ తర్వాతి స్థానాన్ని రిపబ్లిక్ టివి అధినేత ఆర్నాబ్ గోస్వామి దక్కించుకున్నారు. రెబల్ జర్నలిస్ట్‌గా పేరు గాంచిన ఆర్నాబ్, సుషాంత్ మరణం అనంతరం అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు. సుషాంత్ కేసును ఆర్నాబ్ హైలైట్ చేసిన తీరుకి దేశమంతా కదిలింది. సుషాంత్‌కు న్యాయం కావాలంటూ ఆర్నాబ్‌తో గొంతుకలిపింది. అదే ఆర్నాబ్‌కు ఎనలేని పాపులారిటి తెచ్చిపెట్టింది.
కనికా కపూర్

భారతీయ గాయకురాలిగా మంచి పేరున్న కనికా కపూర్, గూగుల్ సెర్చ్‌లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. కానీ, తన గానంతో కాకుండా కరోనా సోకిన మొదటి సెలబ్రిటీగా గూగుల్ సెర్చ్‌లో నిలిచింది కనికా. ఈ ‘బేబీ డాల్’ గాయని లండన్ నుంచి తిరిగి వచ్చి క్వారంటైన్ పాటించకుండా పార్టీలో పాల్గొందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వివాదం తనుకు ఇలా పనికొచ్చింది.
కిమ్-జాంగ్-ఉన్

ఇంతటి కరోనా కలకలంలో కూడా, ప్రపంచ జనాల్ని కదిపేసిన ప్రశ్న ఇది. నార్త్ కొరియన్ నియంతగా పేరు గాంచిన కిమ్ బతికున్నాడా లేదా? ఈ ప్రశ్న కొద్ది రోజుల పాటు గూగుల్‌లో తెగ హల్ చల్ చేసింది. చివరికి అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ అందరి ముందుకు వచ్చి ఆశ్చర్యపరిచారు.
Also Read ;- కామ్ గా ఉంటే ఆర్నబ్ గోస్వామీ ఎందుకు అవుతాడు!
అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ 5 వ స్ధానం అందుకున్నారు. బాలీవుడ్ బిగ్ బి కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. వయసు ఎక్కువ కావడం, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల అభిమానులు కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే ప్రతిక్షణం బిగ్ బి ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ గూగుల్‌లో బాగా వెతికేసారు.
రషీద్ ఖాన్

గూగుల్ సెర్చ్ టాప్ 10 లో స్థానం పొందిన ఒకే ఒక్క క్రికెటర్ రషీద్ ఖాన్. ఆఫ్గాన్ క్రికెటరైనా కూడా ఐపీఎల్-2020 లో హైదరాబాద్ తరపున ఆడాడు. ఈ టి20 సీరీస్‌లో తన పేరు మార్మోగిపోయింది. ఇక తన మూలాల గురించి జనాలు వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాట వల్లే గూగుల్ సెర్చ్‌లో 6వ స్థానాన్ని పొందాడు.
రియా చక్రవర్తి

బాలీవుడ్ యాక్టర్ సుషాంత్ మరణం దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఈ నేపథ్యంలో సుషాంత్ కంటే ఎక్కువగా రియా గురించి వెతికారు జనాలు. సుషాంత్ మరణానికి కారకురాలంటూ మీడియా నుంచి జనాల వరకు తనని నిందించారు. సెలబ్రిటీలు మాత్రం తనకు అండగా నిలిచి తమ మద్దతును ప్రకటించారు. ఈ క్రమంలోనే రియా గూగుల్ సెర్చ్ లో టాప్ 10 లో స్థానం పొందింది.
Also Read ;- ఇకపై ‘వైట్ హౌస్’ లో ఆడవారిదే ఆధిపత్యం
కమలా హారీస్

వైట్ హౌస్ ఎన్నికల్లో విరబూసిన భారతీయ-ఆఫ్రికన్ కమలా హారీస్. భారతీయ మూలాలు కలిగిన హారీస్ అమెరికా మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా గెలిచి చరిత్ర సృష్టించారు. కమలా ప్రచారం సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అమెకన్లకు తోడు భారతీయులు, నల్ల జాతీయుల మద్దతు లభించడంతో కమలా హారీస్ అద్భుత విజయాన్ని అందుకున్నారు.
అంకితా లోకాండే

సుషాంత్ కేసులో రియా తర్వాత అంత పాపులారిటి పొందిన వ్యక్తి అంకితా. సుషాంత్ ఎక్స్-గర్ల్ ఫ్రెండ్‌గా, టివీ రంగం పాపులారిటీ కలిగిన వ్యక్తిగా పేరున్న అంకితా, సుషాంత్ మరణాంతరం మరింత వెలుగులోకి వచ్చారు. సుషాంత్-అంకితా ప్రేమ కధ గురించి తెలుసుకోవాలని జనాలు తెగ ఉత్సాహం చూపించారు. అంతేకాదు, సుషాంత్-అంకితా కలిసి నటించిన ‘పవిత్ర రిష్తా’ ప్రేక్షకుల కోరిక మేరకు తిరిగి ప్రసారం చేసేంతగా జనాలు వెతికేసారు అంకిత కోసం.
Also Read ;- `బ్యాక్ డోర్` ఎంట్రీతో ఆమె జీవితంలో ఏం జరిగింది?
కంగనా రనౌత్

కంగనా రనౌత్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పచ్చు. మొదటి నుండి వారసులను వ్యతిరేకిస్తూ వస్తున్న కంగనా, సుషాంత్ మరణాంతరం ఆమె మరింత పదునైన మాటలతో బాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఢీ అంటే ఢీ అంది. చివరికి కేంద్రం ఈమెకు వై-క్యాటగిరి సెక్యురిటీ కల్పించేవరకు వెళ్లంది వ్యవహారం. ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కంగనాను నెటిజన్లు బాగా ఫాలో అయ్యారని ఈ గూగుల్ సెర్చ్ రిపోర్ట్ చూస్తుంటే తెలుస్తుంది.











