వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎంతో శ్రమించి ప్లాన్ చేసుకున్న చిత్తురు జిల్లా బంగారుపాళ్యం తోతాపురి మామిడి రైతుల ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ముందే లీక్ కావడంతో షో రక్తి కట్టలేదు. జగన్ రాక ముందే రోడ్డు మీద మామిడికాయలు పోసి హంగామా చేయాలని స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నారు. ఐతే అది అనుకున్నంత ఆసక్తిగా జరగలేదు. ఇక జగన్ ఎంట్రీకి ముందే రచ్చ చేయాలని భావించారు. కొంత మంది రౌడీలను తీసుకువచ్చి పోలీసులను నరుకుతామంటూ బెదిరించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు.
జగన్ తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పోలీసుల ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోలేదు. మార్కెట్ యార్డులోకి కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. జగన్ చుట్టూ మళ్లీ పాత పద్ధతిలోనే తోపులాట జరిగేలా, ఆయనకు ప్రజాదరణ తగ్గలేదనే భావన కలిగించేలా స్కిట్ చేశారు. ఇక జగన్ కూడా ఈ తోపులాట మధ్యలోనే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైసీపీ హయాంలో రైతులు వెలుగు వెలిగారని, తోతాపురి మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించామని ఆవేశంలో మాట్లాడారు. కూటమి సర్కార్‌పై రాసి పెట్టుకున్న ఆరోపణలన్ని చేశారు జగన్. ఈ ఈవెంట్ కోసం భూమన
ఇక జగన్ ఈ సారి కూడా కార్యకర్తలను బలి చేయాలని రెడీ అయ్యే వచ్చారు. బంగారుపాళ్యంలోనూ అదే సీన్ రిపీట్ చేశారు. 10 రోజుల ముందు నుంచే..ఈ పర్యటనలో ఎలా రచ్చ చేయాలో ప్లాన్ చేసుకుని వచ్చారు. కానీ పోలీసులు ఈ సారి అలర్ట్‌గా ఉన్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇక మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన కాయలను రోడ్డు మీద పడేసి, ట్రాక్టర్లతో తొక్కించి రైతుల కష్టానికి విలువ లేకుండా చేశారు. ఈ చర్య కష్టపడ్డ రైతులను ఎంతో కలిచివేయడమే.. జగన్ అరాచక మనస్తత్వానికి అద్దం పడుతుంది. అంతేకాదు..ఈ పర్యటనలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌పై కొంత మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.











