మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఆయన తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతి రెడ్డితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌పోర్టు ఆఫీస్‌కు జగన్ వెళ్లారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన తర్వాత అరగటంలోనే అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ఆ సమయంలో వైస్ జగన్ వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, ఇతర నాయకులు కూడా ఉన్నారు.
దీంతో వైఎస్ జగన్ త్వరలో లండన్ పర్యటనకు వెళ్లనున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే మూడు రోజుల కిందట వరకూ బెంగళూరులో జగన్ కేవలం పాస్ పోర్టు రెన్యువల్ కోసమే తాడేపల్లికి వచ్చారని చెబుతున్నారు. నిజానికి రెడ్డి పాస్ పోర్టు కోర్టు దగ్గర ఉంటుంది. అక్రమాస్తుల కేసుల్లో కోర్టు ఆయన పాస్ పోర్టును ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాట్ పాస్ పోర్టు తీసుకున్నారు. ఇప్పుడు సీఎం పదవి పోయింది కాబట్టి ఆ డిప్లొమాట్ పాస్ పోర్టు పని చేయదు. కాబట్టి, పాత పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు.
పదవి లేనప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అంత సేఫ్ కాదని భావిస్తున్న జగన్.. ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. తాజా పరిణామాలను బట్టి, బెంగళూరు కూడా సేఫ్ కాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఓ కారణం చెప్పి.. కొన్నాళ్ల పాటు విదేశాలకు మకాం మార్చాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి లండన్‌లో కొన్ని ఏర్పాట్లు జరిగాయని చెబుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లోనే ఉంటారు. వారి కోసం నివాసం.. ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని.. జగన్ కొంత కాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇండియాలోనే ఉందామని భారతి చెబుతున్నా వినకుండా లండన్ కోసం జగన్ పయనం అవుతున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్యం బాగా లేదనో, లేదా ఏదైనా సర్జరీ చేయించుకోవాలనో పత్రాలు క్రియేట్ చేసి యూకే వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే విజయవాడలో పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకునేందుకు వచ్చి.. మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.










