వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. దాదాపు వారం రోజుల తర్వాత బెంగళూరు ప్యాలెస్ వీడి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిన జగన్ దంపతులు..వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిశారు. ఐతే ఓ గవర్నర్‌ను మాజీ ముఖ్యమంత్రి కలవడం సర్వసాధారణం. కానీ జగన్ ఎన్నడూ లేని విధంగా తన సతీమణి భారతిని వెంటబెట్టుకెళ్లడం చర్చకు దారి తీసింది.
ఐతే ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్, ఈ కేసులో జరుగుతున్న అరెస్టు గురించి జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్టయ్యారు. ఇక చివరిగా తన వంతు వచ్చేసిందని జగన్ భయపడుతున్నారు. లిక్కర్ కేసులో జైలుకెళితే బయటకు రావడం కష్టమని కూడా జగన్ అనుమానపడుతున్నారు. ఐతే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు..బీజేపీ పెద్దలకు గవర్నర్ ద్వారా జగన్ రాయబారం పంపారని టీడీపీ నేతలు చెప్తున్నారు.
ఈ కేసులో జగన్ సతీమణి భారతి హస్తం కూడా ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును భారతి సిమెంట్స్‌కు మళ్లించారని సిట్ అధికారులు గుర్తించారు. భారతి సిమెంట్స్‌లో ఇటీవల సోదాలు సైతం నిర్వహించారు. భారతి సిమెంట్స్‌కు చెందిన బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. బాలాజి గోవిందప్ప భారతి ఆర్థిక వ్యవహారాలను చూసేవారు. భారతి కూడా లిక్కర్ స్కాంలో కీలక నిందితురాలని..కాంగ్రెస్ ఎంపీ మాణిగం ఠాగూర్ ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. చాలా పకడ్బందీగా ఈ స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. లిక్కర్ కేసు భారతి దగ్గరకు వస్తుందన్న భయంతోనే జగన్ గవర్నర్‌తో భేటీ అయి ఉంటారనే చర్చ నడుస్తోంది.
ఇప్పటివరకు ఈ కేసులో బలమైన ఆధారాలు సంపాదించాకే అరెస్టు చేశారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. కోర్టులు ఆ విజ్ఞప్తిని తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేశారు.











