తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆమె కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తున్నారు. మాస్క్ ధరించి దీక్ష కొనసాగిస్తున్నారు. మూడో రోజు దీక్ష చేస్తుండటంతో ఆమె ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే డాక్టర్లు షర్మిలను పరీక్షించి, ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. షర్మిలకు మద్దతుగా అభిమనులు లోటస్ పాండ్ చేరుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో దీక్ష శిబిరానికి అభిమానులు రావొద్దని షర్మిల టీం అభిమానులను కోరుతున్నారు. ఖమ్మం సంకల్ప సభతోపాటు షర్మిల దీక్షలో ఎవరూ కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో, ఆమె ముఖ్య అనుచరులు కరోనా బారిన పడ్డారు.
Must Read ;- సాక్షిలో విజయమ్మ, షర్మిల మాత్రమే.. డా.సునీత కనిపించలేదా?