నిన్న రాత్రి చిరంజీవి చేసిన కామెంట్లు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయంలో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చేసిన పరోక్ష కామెంట్లు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే చేసాడని వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ల నోటికి పని చెబుతున్నారు.
అస్సలు ఏమి జరిగిందంటే.. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ, పిచుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు. ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చేయాల్సింది చాల ఉందని, అలాగే ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. మీరు అంతగా అభివృద్ధి చేయాలనుకుంటే రోడ్లు వేయండి, తాగునీటి ప్రోజెక్టులని పూర్తి చేయండి, నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించండి, అంతేగాని సినిమా ఇండస్ట్రీని మాత్రం ఇబందులకి గురి చేయొద్దని వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించే ప్రయత్నం చేసాడు.
దీంతో వైసీపీ నాయకులకి ఎక్కడో కాలినట్టుంది అందుకే వాళ్ళు ఒక్కొకరుగా ప్రెస్ మీట్లు పెట్టి చిరంజీవి వ్యాఖ్యలని ఖండిస్తున్నారు. కొందరు బూతుల దండకం అందుకున్నారు. చిరంజీవికి దమ్ముంటే రాజకీయ నాయకుడిగా వచ్చి మాట్లాడాలని, రాజకీయం చేయడానికి చేతకాక పార్టీని అమ్ముకున్న వ్యక్తి కూడా మాకు రాజకీయ సలహాలు ఇస్తున్నాడు అని కోడలి నాని మండి పడ్డాడు.
చిరంజీవి కి దమ్ముంటే, అంత జన బలమే ఉంటె ప్రత్యక్ష రాజకీయాలలో వాళ్ళ తమ్ముడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోమనండి అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేసాడు..
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మీరు ముందు సినిమాలు చేయండి, ఫైట్లు చేయండి, డ్యూయెట్లు పాడుకోండి అంతేగాని రాజకీయంగా మీకు సూన్యం అని చిరంజీవికి కౌంటర్ ఇచ్చాడు. పేర్ని నాని, మంత్రి రోజా ఇలా వైసీపీ నాయకులు అందరు కూడా చిరంజీవిని టార్గెట్ చేసి మాటల దాడికి దిగారు.
చిరంజీవిని టార్గెట్ చేసి మాట్లాడిన వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఫ్యాన్స్, అలాగే సామాన్య ప్రజలు కూడా చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నాయకులకి నిరసన సెగలు తగులుతున్నాయి. చిరంజీవిని కామెంట్స్ చేసి పెద్ద తప్పు చేసాం అని వైసీపీ నాయకులకి కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది.