(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న నిరసన చేపట్టాలని దేశంలోని పది ప్రధాన ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి.ఉచిత వ్యాక్సిన్,నూతన సాగు చట్టాల రద్దు వంటి ప్రధాన డిమాండ్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.’బ్లాక్ డే ఫర్ ఇండియన్ డెమొక్రసీ’ పేరుతో నిరసన చేపట్టాలని దేశంలోని పది ట్రడ్ యూనియన్ల ఐక్య వేదిక నిర్ణయించింది.నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి,నల్ల జెండాలతో ఈ నెల 26 ప్రభుత్వానికి గళం వినిపించనున్నట్లు తెలిపాయి.
ప్రధాన డిమాండ్లు..
అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.పేదలకు ఉచిత రేషన్,నెలవారీ ఖర్చులకు రూ.7,500 నగదు.మూడు నూతన సాగు చట్టాల రద్దు.మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని,తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం చేస్తామని యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
పాల్గొంటున్న ట్రేడ్ యూనియన్లు..
నేషనల్ ట్రేడర్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ),ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ),హింద్ మజ్దూర్ సభా (హెచ్ఎంఎస్),సెంటర్ ఆఫ్ ఇండియన్ యూనియన్(సీఐటీయూ),ఆల్ ఇండియా యూనైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ),ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ సెంటర్(టీయూసీసీ),సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్(సెవా),ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(ఏఐసీసీటీయూ),లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్పీఎఫ్),యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటీయూసీ)నిరసనల్లో పాల్గొననున్నాయి.
Must Read ;- మోడీ భావోద్వేగం.. అంతర్జాతీయంగా సెటైర్లు











