రాష్ట్రంలో మంత్రులు పోటీపడి మరీ ఏకగ్రీవాలు భారీగా నమోదు చేయించడంతో.. మొత్తం 2,197 పంచాయతీలు ఈ జాబితాలో నిలిచాయి. వీటిలో 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్న వాటికి 15 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు 20 లక్షలు నజరానాగా చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం లెక్కిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 100 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.
ప్రతి జిల్లాకూ ఏటా కనీస పక్షంలో 10 కోట్లకు పైగా దక్కే అవకాశం ఉంది. కడప జిల్లాకు అత్యధికంగా 20.65 కోట్లు అందనుండగా.. ప్రకాశం జిల్లాకు 12.30 కోట్లు, కర్నూలు జిల్లాకు 11.25 కోట్లు అందనున్నాయి. కాగా, పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2020-21కి గాను ఇప్పటికే మొదటి విడత నిధులు విడుదల కాగా.. తాజాగా రెండో విడత మౌలిక గ్రాంట్ కింద 656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ