మహారాష్ట్రలో సోమవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిననట్లు తెలుస్తోంది. మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. చనిపోయినవాళ్లలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Must Read ;- అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాష్టీకం.. నలుగురి పరిస్థితి విషమం