వైసీపీ అధినేత జగన్ పని అయిపోయింది.. ఈ మాట ఎవరో చెబుతున్నది కాదు.. జాతీయ మీడియా. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వరసగా పలు జాతీయ మీడియా సంస్థలు సర్వేలు విడుదల చేస్తున్నాయి.. గత 5 రోజుల విరామంలోనే ఏకంగా మూడు జాతీయ చానెల్స్ రిలీజ్ చేసిన సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికే పట్టం కడుతున్నాయి.. వీటిల్లో మెజారిటీ సర్వేలు నిన్నమొన్నటివరకు వైసీపీకే పట్టం కట్టాయి.. టీడీపీ అధికారానికి ఆమడ దూరం అని కుండబద్దలు కొట్టాయి.. నోటిఫికేషన్ వెలువడడంతో ఈ చానెల్స్ సంస్థలు అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెస్తున్నాయని, ఇప్పటివరకు చేసినవి అన్నీ పెయిడ్ సర్వేలు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో జగన్‌దే అధికారం అని ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు చెప్పిన జాతీయ మీడియా ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ సంస్థ. ఈ మీడియా హౌజ్.. గతంలో టీడీపీ కేవలం సింగిల్ డిజిట్ నెంబర్ కే లోక్ సభ స్థానాలు పరిమితం అవుతాయని తెలిపింది.. తాజాగా ఈ సంస్థ… టీడీపీ -జనసేన బీజేపీ కూటమికి 17 -18 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.. వైసీపీ 7-8 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించనుందని వివరించింది.. నెల రోజుల్లోనే ఆ చానెల్ సంస్థ స్వరం మార్చింది..
తాజాగా టీడీపీ కూటమికి పట్టం కట్టిన మరో సర్వే… సీఎన్‌ఎన్ న్యూస్ 18.. ఈ సంస్థ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. జగన్ గ్రాఫ్ బాగా పడిపోయిందని, తాజాగా ఈ చానెల్ చేసిన పోల్ సర్వేలో వైసీపీ ఓట్ బ్యాంక్ కేవలం 40 శాతానికే పరిమితం కానుందని వివరించింది.. ఇక, టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ బ్యాంక్ రానుందని తేల్చి చెప్పింది.. వైసీపీ ఈ దఫా కేవలం 4-5 ఎంపీ స్థానాలకే లిమిట్ కానుందని అభిప్రాయ పడింది..
ఇక, నిన్నమొన్నటి వరకు వైసీపీ 24-25 స్థానాలు దక్కుతాయని ఊదరగొట్టిన ఈటీజీ సర్వే సంస్థ.. ఈసారి ప్లేట్ తిప్పేసింది.. ఎన్నికల మూడ్ రావడంతో, ప్రజల నాడి అర్ధం చేసుకుందో ఏమో తెలియదు కానీ, ఈసారి వైసీపీని కేవలం 17 స్థానాలకే పరిమితం చేసింది.. టీడీపీ కూటమికి 8 స్థానాలు వస్తాయని వివరించింది.. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఈ మార్జిన్ మరింత తగ్గి, టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయని తేల్చిచెప్పినా కంగారు పడాల్సిన పనిలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
ఈటీజీ సర్వే గ్రూప్ సంస్థ… తాడేపల్లి హౌజ్ నుండే పని చేస్తుందనే ప్రచారం ఉంది.. ఆ సంస్థే టీడీపీ దూకుడుని పెంచి లీకులు ఇస్తుందంటే జగన్ పని అయిపోయినట్లే అని, టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు.. మొత్తమ్మీద, జాతీయ స్థాయిలో సర్వేలన్నీ టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికే పట్టం కడుతున్నాయి..