ఇంటికి సంబంధించిన వస్తువుల నుండి, స్పోర్ట్స్, కర్లు.. ఇలా ఏ వస్తువైనా ఓఎల్‌యక్స్‌లో తక్కువ ధరకు లభిస్తుందనే విషయం మనందరికీ తెలుసు. కొందరు ప్రబుద్ధులు సరదాకి చేశారో లేక ఎవరు కనిపెట్టలేరని అనుకున్నారో గానీ.. ఏకంగ మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాశి కార్యలయాన్ని ఓఎల్‌యక్స్‌లో 7.5 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వరకూ చేరింది. చివరకు యాక్షన్‌లోకి దిగిన పోలీసులు ఈ పని చేసిన వారిని కనిపెట్టే పనిలో పడ్డారు. ఐపి అడ్రస్ ఉపయోగించి కూపీ లాగే పనిలో పడ్డారు.
మొత్తానికి దొంగలు దొరికారు
పోలీసుల ప్రయత్నాలు ఫలించి ఈ పని చేసి వాళ్లు చిక్కారు. ఇటువంటి పనికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఓఎల్‌యక్స్ నుంచి యాడ్‌ని కూడా తొలగించారు. మరి వారెందుకిలా పెట్టారో ఇంకా తెలియరాలేదు. కేవలం ఆకతాయిగా చేశారా లేదా మరేదైనా కారణం ఉందా అనేది పోలీసులు ఇంటరాగేషన్ పూర్తిచేసిన తర్వాత వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Must Read ;- మోడీకి లిట్మస్ టెస్ట్ పెట్టేసిన అన్నదాతల ఆక్రోశం..