అమరావతి రాజధాని లేని రాష్ట్రానికి స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములిచ్చిన అమరావతి అన్నదాత.. తనకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి నేటికి 436 రోజులు గడిచాయి. కరోనా కాలంలోనూ వీరి ఉక్కు సంకల్పం చెక్కు చెదరలేదు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్న వీళ్లు.. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా అందుకు జతకలిపారు. విశాఖ ఉక్కును కాపాడుకుని తీరతామంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ నినదిస్తున్నారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఉద్యమం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. సంఘీభావం తెలిపిన రైతులు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.
Must Read ;- అమరావతి కోసం అమెరికాలో దీక్ష..